ETV Bharat / state

Double Bedroom Houses: నిర్మాణాలు పూర్తైనా.. సౌకర్యాలు మాత్రం కరవు - సౌకర్యాలు లేకుండా రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం

రాష్ట్ర రాజధానిలో లక్షలాది కుటుంబాలు రెండు పడక గదుల ఇళ్ల (Double Bedroom Houses) కోసం ఎదురు చూస్తున్నాయి. దీనికి అనుగుణంగా ఏడాది కిందటే 65 వేల ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. విచిత్రంగా వీటిని ఇప్పటిరకు లబ్ధిదారులకు అందజేయలేదు. దీనికి కారణమేమిటని ఆరా తీస్తే...నిర్మాణం పూర్తయిన అపార్టుమెంట్‌ సముదాయాలకు ఇంత వరకు విద్యుత్తు, తాగునీటి సౌకర్యం కల్పించలేదు. రెండు విభాగాలకు రూ.500 కోట్లను చెల్లిస్తే ఆయా సౌకర్యాలు కల్పించడానికి సంబంధిత అధికారులు సిద్ధంగా ఉన్నారు. నిధులు విడుదల చేయరు.. తాగునీరు, విద్యుత్తు సౌకర్యం రాదు... ఇది హైదరాబాద్​ పరిధిలో రెండు పడకల ఇళ్ల నిర్మాణ పథకం దుస్థితి.

Double Bedroom Houses
రెండు పడక గదుల ఇళ్ల
author img

By

Published : Jul 10, 2021, 9:09 AM IST

గ్రేటర్​ హైదరాబాద్ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు ఉచితంగా రెండు పడకల ఇళ్ల (Double Bedroom Houses) నిర్మాణం మొదలుపెట్టాలని నాలుగేళ్ల కిందటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని 40 మురికివాడలను ఖాళీ చేసి అక్కడ 8898 ఇళ్లను అపార్టుమెంట్ల రూపంలో నిర్మించాలని తలపెట్టారు. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో కూడా ఇలానే 91,102 ఇళ్లను నిర్మించాలని నిర్ణయించారు. వీటిలో దాదాపు 65 వేల ఇళ్ల నిర్మాణాన్ని ఏడాది కిందటే జీహెచ్‌ఎంసీ అధికారులు పూర్తి చేశారు. వీటన్నింటికి జలమండలి అధికారులు తాగునీటి సౌకర్యం కల్పించాల్సి ఉంది.

ఇదేరీతిలో విద్యుత్తు సంస్థ ప్రతి ఇంటికి కనెక్షన్‌ ఇవ్వాల్సి ఉంది. ఈ రెండు సౌకర్యాలను కల్పించాలంటే దాదాపు రూ.500 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఆ నిధులు విడుదల చేయకపోవడంతో అపార్టుమెంట్ల సముదాయాలు అలంకారప్రాయంగా మారాయి. మరోవైపు నిర్మాణం పూర్తయిన ఇళ్లలో కొందరు సంఘ విద్రోహ కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. కొన్నిచోట్ల అపార్టుమెంట్‌ గేట్లు పగులగొట్టి లోపలికి వెళ్లి గంజాయి సేవిస్తున్నారు. మరికొంతమంది వీటిని పేకాట స్థావరాలుగా మార్చారు. మరికొందరు వ్యభిచార కూపాలుగా మారుస్తున్నారు.

మూడేళ్లనుంచి ఎదురు చూపులు... సొంతింటి కోసం పడిగాపులు

వ్యయం తీరిది (రూ.కోట్లలో)
ప్రాజెక్టు కోసం ఖర్చు చేయాల్సిన తొలి అంచనా వ్యయం 8598.58
స్టీలు పెరగడం వల్ల అదనపు భారం 500
ఇతర శాఖలు చేయాల్సిన వ్యయం 616.01
మొత్తం ప్రాజెక్టుకయ్యే వ్యయం 9714.59
ఇప్పటివరకు సర్కార్‌ కేటాయించిన మొత్తం 6256.71
ఇంకా విడుదల చేయాల్సిన మొత్తం 3457.88

అదే ప్రధాన సమస్య!

లక్ష ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలంటే ఇంకా రూ.3457 కోట్లను సర్కార్‌ విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటికే గుత్తేదారులకు రూ.600 కోట్ల మేర బకాయిలను ఇవ్వాల్సి ఉంది. గృహ నిర్మాణ శాఖ నుంచి నిధుల లేమితో ఏడాదిన్నరలో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు నాలుగేళ్లైనా కూడా పూర్తి కాలేదు. నిధులు విడుదల చేస్తేనేగానీ తాము పనులు పూర్తి చేయలేమని గుత్తేదారులు చెబుతున్నారు.

లబ్ధిదారుల గుర్తింపు ఎప్పటికో..?

హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని 40 మురికివాడలను ఖాళీ చేయించి 8898 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అవి చివరి దశకు వచ్చాయి. ఇందులో 12 ప్రాంతాల్లో 2494 గృహ నిర్మాణం పూర్తయి లబ్ధిదారులకు అందజేశారు. మరో 1750 ఇళ్లు సైతం పూర్తయ్యాయి. మురికివాడలు ఖాళీ చేసే సమయంలోనే ఇక్కడ లబ్ధిదారులను గుర్తించారు. కాబట్టి ఆ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక పూర్తయినట్లే. అదే మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లా పరిధిలో నిర్మించిన ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులను ఇప్పటి వరకు ఎంపిక చేయలేదు. లక్షలాదిమంది మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వీటిని రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేస్తున్నారు. తరువాత అధికారులతో కూడిన కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. ఇది ఎప్పటికి పూర్తవుతుందో తెలియడం లేదు.

ఇదీ చూడండి: Double Bedroom houses: "పట్టణాల్లో వడివడిగా.. పల్లెల్లో నెమ్మదిగా"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.