ETV Bharat / state

Dost Allotment: దోస్త్ మొదటి విడత సీట్ల కేటాయింపు.. ఆ సబ్జెక్ట్​పైనే విద్యార్థుల ఆసక్తి - కామర్స్​లో చేరేందుకే మొగ్గు

దోస్త్ ద్వారా డిగ్రీలో చేరేందుకు మొదటి విడత సీట్లను అధికారులు కేటాయించారు. ఈసారి అబ్బాయిలకన్నా అమ్మాయిలే ఎక్కువగా ఆసక్తి చూపారు. అబ్బాయిలకు 89వేల 109 సీట్లు.. అబ్బాయిలకు 78 వేల 21 సీట్లు దక్కాయి. ఈ ఏడాది కూడా ఎక్కువ మంది విద్యార్థులు కామర్స్​లో చేరేందుకే ఆసక్తి కనబరిచారు. రాష్ట్రంలో 27 డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు ఒక్క విద్యార్థి కూడా ముందుకు రాలేదు. రేపటి నుంచి ఈనెల 18 వరకు దోస్త్ రెండో విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు.

Dost first phase counselling seat allotments
దోస్త్ మొదటి విడత సీట్ల కేటాయింపు
author img

By

Published : Aug 5, 2021, 5:03 AM IST

రాష్ట్రవ్యాప్తంగా 950 కళాశాలల్లోని 501 కోర్సుల్లో 4 లక్షల 8 వేల 345 సీట్ల భర్తీ కి ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి విడతలో ఇవాళ లక్ష 67 వేల 130 మందికి డిగ్రీ సీట్లను కేటాయించినట్లు దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. మొదటి విడతలో 2 లక్షల 6 వేల 44 మంది దోస్త్ లో రిజిస్ట్రేషన్ చేసుకోగా.. వారిలో లక్ష 81 వేల 638 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. తగినన్ని ఆప్షన్లు ఇవ్వకపోవడంతో 14 వేల 508 మందికి సీటు దక్కలేదని లింబాద్రి తెలిపారు. లక్ష 30 వేల 94 మందికి మొదటి ఐచ్ఛికంగా కోరుకున్న సీటే దక్కింది.

ఈ ఏడాది కూడా ఆ సబ్జెక్ట్​పైనే ఆసక్తి

ఈ ఏడాది కూడా కామర్స్​లో చేరేందుకే ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి కనబరిచారు. కేటాయించిన సీట్లలో 39.43 శాతం అంటే 65 వేల 897 మంది కామర్స్ విద్యార్థులకే ఉన్నాయి. ఆ తర్వాత భౌతిక శాస్త్రంలో 35 వేల 731.. ఆర్ట్స్ లో 22 వేల 594 విద్యార్థులు సీటు పొందారు. సీటు పొందిన విద్యార్థుల్లో ఆంగ్లమాధ్యమం లక్ష 47 వేల 36 మంది.. తెలుగు మాధ్యమం 18 వేల 889 మంది ఉన్నారు. అబ్బాయిలకన్నా అమ్మాయిలే సంప్రదాయ డిగ్రీలో చేరేందుకు మొగ్గు చూపారు. ఇవాళ కేటాయించిన మొదటి విడత సీట్లలో అబ్బాయిలు 46.68 శాతం 78 వేల 21 మంది ఉండగా.. అమ్మాయిలు 53.32 శాతం 89 వేల 109 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 27 డిగ్రీ కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. ఇవాళ మొదటి విడత సీట్ల కేటాయింపు కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి, కళాశాల విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, దోస్త్ కన్వీనర్ లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.

వెబ్​సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్

మొదటి విడతలో సీటు పొందిన అభ్యర్థులు దోస్త్ వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలని కన్వీనర్ లింబాద్రి తెలిపారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని సీటు రిజర్వ్ చేసుకున్న తర్వాత అవసరమైతే రెండో విడతలో మరింత మెరుగైన సీటు కోసం ప్రయత్నించవచ్చునని ఆయన తెలిపారు. ఆన్ లైన్​లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే.. సీటు కోల్పోతారని కన్వీనర్ స్పష్టం చేశారు. రేపటి నుంచి ఈనెల 18 వరకు దోస్త్ రెండో విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు జరుగుతాయి. మొదటి విడత సీట్ల కేటాయింపు తర్వాత.. ఇంకా 2 లక్షల 41 వేల 215 సీట్లు మిగిలి ఉన్నాయి.

ఇదీ చూడండి:

DOST: దోస్త్ మొదటి విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువు మరోసారి పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.