ప్రభుత్వంలో అంతర్భాగమైన తెరాస నేతలకే ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం లేక... ప్రైవేటు దవాఖానాల్లో చికిత్స తీసుకుంటున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రభుత్వ వైఖరిపై విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి ఫామ్‌హౌస్ నుంచి బయటకు వచ్చి ప్రభుత్వ దవాఖానాలను పరిశీలించాలని కోరారు.
కరోనా సోకిన రోగులందరికీ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే చికిత్స అందిస్తామని గతంలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఏమైందని ప్రశ్నించారు. సొంత పార్టీ నేతలే గాంధీ ఆసుపత్రిపై విశ్వాసం లేక యశోదా, అపోలో లాంటి కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులను పరిశీలించాలన్నారు. పేద ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకొని... వారి ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి : హైదరాబాద్‌లో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టాలి: అంజన్ కుమార్