ETV Bharat / state

SURABHI: సురభి కళాకారుల కథనానికి స్పందన.. దాతల ఆర్థిక చేయూత.. - సురభి కళాకారుల కథనానికి దాతల స్పందన

కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న సురభి కళాకారులపై ఈటీవీ-భారత్ తెలంగాణలో ప్రసారమైన 'కన్నీరు పెడుతున్న 136 ఏళ్ల ఘన చరిత్ర' కథనానికి దాతలు స్పందించారు. కళాకారులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వారికి సాయం చేశారు.

donors-responds-on-etv-bharath-story-about-surabhi-artists-facing-problems
సురభి కళాకారుల కథనానికి స్పందన.. దాతల ఆర్థిక చేయూత..
author img

By

Published : Jun 22, 2021, 12:57 PM IST

సురభి కళాకారుల కథనానికి స్పందన.. దాతల ఆర్థిక చేయూత..

కరోనా కష్టకాలంలో సురభి కళాకారులు పడుతున్న ఇబ్బందులపై ఈటీవీ-భారత్ తెలంగాణలో ప్రసారమైన కథనం దాతలను కదిలించింది. 'కన్నీరు పెడుతున్న 136 ఏళ్ల ఘన చరిత్ర' పేరుతో ప్రసారమైన కథానాన్ని వీక్షించిన ఎల్బీనగర్ నాగోల్​లోని రైస్ ఏటీఎం స్వచ్చంద సంస్థ నిర్వాహకులు దోసపాటి రాము, యశస్విని జొన్నలగడ్డ... బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. కళాకారులకు కుట్టు మిషన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే మరికొందరి చేత టిఫిన్ సెంటర్లు ఏర్పాటు చేయిస్తామని పేర్కొన్నారు.

ఎంతో వైభవంగా ఎదిగి వందల ఏళ్ల చరిత్ర ఉన్న సురభి కళాకారుల కుటుంబాలు ఇబ్బంది పడటం చూసి మనసు కలిచివేసిందని దోసపాటి రాము తెలిపారు. ప్రాజెక్టు ప్రిషా ద్వారా సురభి కళాకారులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చేయూతనిస్తామన్నారు. వారి చేత కుట్టుమిషన్లు, టిఫిన్ సెంటర్లు ఏర్పాటు చేయిస్తామని యశస్విని జొన్నలగడ్డ అన్నారు. సురభిని కాపాడుకునేందుకు ప్రభుత్వంతోపాటు మరికొంత మంది దాతలు ముందుకు రావాలని వారు కోరారు.

ఇదీ చూడండి: Surabhi: కన్నీరు పెడుతున్న 136 ఏళ్ల ఘన చరిత్ర

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.