ETV Bharat / state

ఆదుకునే చేతులు.. ఆదరించే చేతలు - Minister KTR Latest News

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి ఆపన్నులు మేమున్నామంటూ ముందుకొచ్చి ఆదుకుంటున్నారు. కొందరు నిత్యావసరాలు, ఆహారం అందిస్తుండగా మరికొందరు సీఎం సహాయనిధికి విరాళాలు అందించి ప్రభుత్వానికి సహకరిస్తున్నారు.

సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌కు మాస్కుల ప్యాకెట్లు అందిస్తున్న ఇన్ఫోసిస్‌ ఫెసిలిటీ హెడ్‌ దాస్‌ గుణలన్‌

author img

By

Published : Apr 11, 2020, 12:29 PM IST

కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరుకు సహకరించేందుకు అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. తమకు తోచిన విధంగా సహాయపడుతున్నారు. ఇదివరకే కొంత మంది సీఎం సహాయనిధికి విరాళాలు ప్రకటించారు. తాజాగా అమీర్‌పేట, సనత్‌నగర్‌, బేగంపేట, మోండామార్కెట్‌ కార్పొరేటర్లు శేషుకుమారి, కొలను లక్ష్మి, ఉప్పల తరుణి, రూప రూ.2 లక్షల చొప్పున ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం చెక్కులను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్‌కు ప్రగతి భవన్‌లో అందజేశారు.

  • సనత్‌నగర్‌ హనుమాన్‌ దేవస్థానం మాజీ ఛైర్మన్‌ సుభాష్‌ నీమ్‌కర్‌ రూ.2లక్షలు, అమీర్‌పేటకు చెందిన వీరేష్‌, సతీష్‌ కలిసి రూ.50 వేలను మంత్రి కేటీఆర్‌కు అందించారు.
  • నగరానికి వలస వచ్చిన కొందరు కార్మికులు న్యూబోయిన్‌పల్లి మీదుగా తమ స్వగ్రామాలకు వెళ్తున్నట్లు తెలుసుకున్న తెరాస మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం ఇన్‌ఛార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి వారిని కలిశారు. ఆయన కార్మికులకు భోజన పొట్లాలను అందజేసి ఒక్కొక్కరికి రూ.500 ఇచ్చారు.
  • వెంగళరావునగర్‌ డివిజన్‌ పరిధి కల్యాణ్‌నగర్‌-1 కాలనీలో కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య(యూసుఫ్‌గూడ, ఎల్లారెడ్డిగూడ రీజియన్‌) ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, జీహెచ్‌ఎంసీ, జలమండలి, అగ్నిమాపక సిబ్బందికి సిద్ధం చేసిన నిత్యావసర సరుకుల కిట్లను శుక్రవారం జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో కలిసి మంత్రి తలసాని పంపిణీ చేశారు.
  • హైదరాబాద్‌ ఆర్చ్‌ డయాసిస్‌ సోషల్‌ సర్వీసెస్‌ సొసైటీ(హెచ్‌ఏఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో ఎస్పీరోడ్డులోని బిషప్‌ కార్యాలయం, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ప్రాంతంలో సంస్థ ఛైర్మన్‌, హైదరాబాద్‌ ఆర్చ్‌ డయాసిస్‌ బిషప్‌ మోస్ట్‌ రెవరెండ్‌ తుమ్మబాల మాస్కులు, భోజన పొట్లాలను పేదలకు అందజేశారు.
  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చేతుల మీదుగా యాప్రాల్‌ మల్లన్న దేవాలయం ఆవరణంలో పలువురు నిరు పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
  • కుషాయిగూడలోని వలస కార్మికులు, భవన నిర్మాణ కూలీలు 400 మందికి ఈసీఐఎల్‌లోని సొలిస్‌ కంటి ఆసుపత్రి యాజమాన్యం వారు ఆహారం పంపిణీ చేశారు.
  • అంబర్‌పేట ప్రేంనగర్‌ గ్రీన్‌లాండ్‌ వద్ద అరుణ్‌ ప్రజా సేవా సదన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్‌ లాక్‌డౌన్‌ రోజూ 500 మంది పేదలకు అన్నదానం నిర్వహిస్తున్న విషయాన్ని తెలుసుకున్న హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ దత్తాత్రేయ ఆయనకు ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు.
    మాస్కులు కుడుతున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సతీమణి కావ్య

  • ఇన్ఫోసిస్‌ హైదరాబాద్‌ తరఫున ఆ సంస్థ ఫెసిలిటీస్‌ హెడ్‌ దాస్‌ గుణలన్‌ రూ.5.5 లక్షల విలువైన 2,500 ఎన్‌95 మాస్కులను సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌, ఎస్‌సీఎస్‌సీ కార్యదర్శి కృష్ణ యెదులాకు అందజేశారు.
  • భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) నగర ప్రధాన కార్యదర్శి శివాజీ, భాజపా బండ్లగూడ పురపాలక సంస్థ ప్రాంత కార్యదర్శి శ్రీనివాస్‌, ఐటీ విభాగం నాయకుడు శ్రీకాంత్‌ పోలీసుల కోసం 5 వేల గ్లోవ్స్‌(చేతి తొడుగులు)ను సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌కు అందించారు.
  • ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ నియోజకవర్గంలోని దాదాపు 1500 మంది నిరుపేదలకు దాదాపు రూ.4లక్షల విలువైన బియ్యం, నిత్యావసర సరుకులను బంజారాహిల్స్‌లోని తన నివాసం వద్ద అందజేశారు.
  • కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి నేతృత్వాన బర్కత్‌ఫురలో రోటరీ క్లబ్‌ సహకారంతో భాజపా నేతలు సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు శాసనసభా నియోజకవర్గాల్లో పేదలకు 22 టన్నుల వివిధ రకాల కూరగాయల అందేలా పంపిణీకి శ్రీకారం చుట్టారు.
  • ముత్తూట్‌ ఫైనాన్స్‌ సంస్థ సైబరాబాద్‌ పోలీసు అధికారులకు మాస్క్‌లను అందజేసింది.
  • సేవాభారతి, గ్రామభారతి ఆధ్వర్యంలో మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఐదువందల కుటుంబాలకు కూరగాయలు అందజేశారు.

ఇవీచూడండి: రాష్ట్రంలో 487కు చేరిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.