కరోనా బాధితుల సహాయార్థం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఆసరాగా నిలిచేందుకు హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ ముఖ్యమంత్రి సహాయనిధికి 25 లక్షల విరాళం అందజేసింది. ఈ మేరకు ఎఫ్‌ఎన్‌సీసీ ప్రెసిడెంట్ ఆదిశేష గిరిరావు, సెక్రటరి కేఎస్ రామారావు, సంస్థ వ్యవస్థాపకులు, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, ఎఫ్‌డీసీ ఛైర్మన్ రామ్మోహన్‌రావు సంయుక్తంగా ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను కలిశారు. అనంతరం చెక్ అందజేశారు.
సినీ కార్మికుల సంక్షేమం కోసం అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మాత పద్మావతి రూ. 10 లక్షల రూపాయలను అందజేశారు. సీసీసీకి నటుడు సాయికుమార్, తనయుడు ఆది కలిపి 5 లక్షల 4 రూపాయలు విరాళంగా ఇచ్చారు. డబ్బింగ్ యూనియన్‌కు మరో 2 లక్షల 8 రూపాయలు విరాళం అందజేశారు. సాయికుమార్ సోదరుడు రవిశంకర్ లక్ష రూపాయలు విరాళం ఇచ్చారు. సినీ నటుడు ఆర్ సాగర్ 5 లక్షల రూపాయలను మంత్రి కేటీఆర్‌కు అందజేశారు.
ఇవీ చూడండి : కరోనాపై పోరుకు కొత్త సైన్యం- ఆన్లైన్లో శిక్షణ!