ETV Bharat / state

'ఆ లక్షణాలు ఉన్నవారు క్రాకర్స్ పేల్చటం మంచిది కాదు' - గ్రీన్ క్రాకర్స్ వాడకంపై డాక్టర్ల సూచనల వార్తలు

దీపావళిని పర్యావరణ హితంగా జరుపుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బాణసంచా ఎక్కువగా కాల్చడం వల్ల.. కాలుష్యం పెరిగి కరోనా వైరస్ బారిన పడిన రోగులకు ఇబ్బందులు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. మతాబుల నుంచి వెలువడే పొగ, ధూళితో చిన్నపిల్లలు అలర్జీ, న్యుమోనియా బారినపడే అవకాశముందని చెబుతున్నారు.

'ఆ లక్షణాలు ఉన్నవారు క్రాకర్స్ పేల్చటం మంచిది కాదు'

author img

By

Published : Nov 14, 2020, 6:46 AM IST

దీపావళి అంటేనే కాకరపువ్వొత్తులు, మతాబులు, సిచ్చుబుడ్లు కాల్చే పండుగ. ఈ ఏడాది కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా.. బాణసంచాకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా లక్షణాలున్న వాళ్లు క్రాకర్స్ కాలిస్తే వైరస్ వ్యాప్తి చెందే అవకాశముందని అంటున్నారు వైద్యులు. గాలిలో ఉండే దుమ్ము కణాలు, క్రాకర్స్ నుంచి వచ్చే కాలుష్యం పీల్చినపుడు.. అవి ఊపిరితిత్తుల్లో పేరుకుపోయి చిన్న పిల్లలకు ఇబ్బందులు ఎదురవుతాయని శ్వాసకోస నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా నిబంధనలు పాటిస్తూ.. ఎవరి ఇంటి వద్ద వారు పండుగ చేసుకోవాలని సూచిస్తున్నారు.

జాగ్రత్తలు పాటించాల్సిందే...

గ్రీన్ క్రాకర్స్ వినియోగిస్తే కొంతమేర వాయు కాలుష్యాన్ని నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు. చలికాలంలో కరోనా వైరస్ ఎక్కువ సేపు జీవించి ఉండే అవకావముంటుందని.. ప్రజలంతా జాగ్రత్తలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి: ఆవు పేడతో ప్రమిదల తయారీ.. ఎక్కడంటే..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.