ETV Bharat / state

డయాలిసిస్ నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే..! - dialysis patients

లాక్​డౌన్​ కారణంగా కొందరు కిడ్నీ రోగులు డయాలసిస్‌కు దూరంగా ఉంటున్నారు. వారంలో 3-4 సార్లు చేయించుకోవాల్సి ఉండగా.. ఒకటి రెండు విడతలతో సరిపెట్టుకుంటున్నారు. డయాలసిస్‌లు తగ్గించుకోవడం, లేదంటే పూర్తిగా మానేయడం వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Doctors are at risk of negligence dialysis
అలక్ష్యం చేస్తే ప్రమాదమంటున్న వైద్యులు
author img

By

Published : Apr 20, 2020, 10:37 AM IST

Updated : Apr 20, 2020, 2:23 PM IST

కరోనా భయంతో కొందరు కిడ్నీ రోగులు డయాలసిస్‌కు దూరంగా ఉంటున్నారు. మరికొందరు వారంలో 3-4 సార్లకు బదులు.. ఒకటి రెండు విడతలతో సరిపెడుతున్నారు. ఆసుపత్రులకు వెళ్తే ఇతర రోగాలు వచ్చే అవకాశం ఉందన్న భయం వారిని వెంటాడుతుండటమే కారణం కావచ్చు. అయితే డయాలసిస్‌లు తగ్గించుకోవడం, లేదంటే పూర్తిగా మానేయడం వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోగుల్లో ఇది తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని, కొన్నిసార్లు ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

వైద్యుల సలహాలు పాటించాలి

నగరానికి చెందిన 52, 63 ఏళ్ల ఇద్దరు వ్యక్తులు కొంతకాలంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. వీరు వారానికి మూడుసార్లు చేయించుకోవాలి. అయితే కరోనా వ్యాప్తి భయంతో ఒకటి, రెండు విడతలకు మాత్రమే పరిమితమయ్యారు. వైద్యుల సలహా కూడా పాటించకపోవడం వల్ల ఇటీవల ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమించడం వల్ల కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి తరలించారు. కిడ్నీలు పూర్తిగా పాడవడం వల్ల అవి రక్తాన్ని వడపోసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. బయట నుంచి యంత్రం ఆ పని చేస్తుంది. దీనినే డయాలసిస్‌ అంటారు.

గుండె లయ తప్పుతుంది

ఒక్కో రోగి పరిస్థితిని బట్టి వారానికి 3-4 సార్లు డయాలసిస్‌లు అవసరం అవుతుంది. లేదంటే రక్తంలో పొటాషియం పెరిగిపోయి గుండె లయ తప్పుతుంది. ఇదే కొన్నిసార్లు ఆకస్మిక గుండె వైఫల్యానికి(సడన్‌ కార్డియాక్‌ అరెస్టుకు) దారి తీసి, ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. అదే విధంగా డయాలసిస్‌కు దూరంగా ఉంటే.. ఊపిరితిత్తుల్లో కూడా నీరు చేరి.. పల్మనరీ ఎడిమాకు దారి తీస్తుంది. ఊపిరి పీల్చుకోవడం కష్టమై.. అది కరోనా కంటే ఎక్కువ తీవ్రత ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అలాంటి ఆందోళన వద్దు

ఆసుపత్రులకు వస్తే కరోనా సోకుతుందనే భయంతో డయాలసిస్‌లు తగ్గించుకోవడం, పూర్తిగా ఆపివేయడం చాలా ప్రమాదం. అలాంటి ఆందోళన అసలు అవసరం లేదు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం అన్ని చోట్ల రోగుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకవేళ కొవిడ్‌ ఉంటే వారికి ప్రత్యేక గదులు కేటాయించి పూర్తి ఐసోలేషన్‌ చేస్తున్నారు. అంతేకాక బయట నుంచి వచ్చే రోగులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆటోలు, క్యాబ్‌లు ఇతర ప్రైవేటు వాహనాలు వినియోగించకుండా.. సొంత వాహనాలపై ఆసుపత్రులకు రావాలి. దీనివల్ల బయట నుంచి వచ్చే ఇన్‌ఫెక్షన్లను నివారించవచ్చు. డయాలసిస్‌కు వచ్చేటప్పుడు మాస్క్‌, చేతికి గ్లౌజులు ధరించాలి. ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు తీసుకోవాలని కన్సల్టెంట్‌ నెఫ్రాలజిస్టు డాక్టర్‌ ధనుంజయ్‌ చెబుతున్నారు.

ప్రతి రోగిని స్క్రీనింగ్‌ చేస్తాం

నిమ్స్‌లో 65 డయాలసిస్‌ యంత్రాలు ఉన్నాయి. 24 గంటలపాటు సేవలు అందిస్తున్నాం. కరోనా నేపథ్యంలో డయాలసిస్‌కు వచ్చే ప్రతి ఒక్కరినీ స్క్రీనింగ్‌ చేస్తున్నాం. జ్వరం, జలుబు, దగ్గు లాంటివి ఉంటే వారి నుంచి శాంపిళ్లు సేకరించి పరీక్షలకు పంపుతున్నాం. ఇప్పటి వరకు ఇద్దరి నుంచి శాంపిళ్లు పంపాం. ఎలాంటి కరోనా లేనట్లు తేలింది. గాంధీ ఆసుపత్రిని కరోనాకు కేటాయించడంతో అక్కడ రోగులకు కూడా నిమ్స్‌లో డయాలసిస్‌ చేస్తున్నాం. సకల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వైద్యుల సూచనలు లేకుండా సొంత నిర్ణయాలతో డయాలసిస్‌కు దూరంగా ఉండడం సరికాదు. అది ప్రాణాలకే ముప్పని నిమ్స్‌ నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్‌ శ్రీభూషణ్‌రాజు అంటున్నారు.

ఇదీ చూడండి : నేటి అర్ధరాత్రి నుంచి టోల్​ రుసుం వసూలు

Last Updated : Apr 20, 2020, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.