దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో హోలీ పండగలో వయసుతో సంబంధం లేకుండా ప్రజలు పాలు పంచుకుంటారు. ఈ సంబరాల్లో శరీరంపై చల్లుకునే రంగుల్లో హానికర రసాయనాలు లేకుండా జాగ్రత్తలు చేపట్టాలని వైద్యులు చెబుతున్నారు. సరోజినీ దేవి కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రాజలింగం హోలీ రోజున పాటించాల్సిన పలు జాగ్రత్తలను వెల్లడించారు.
సహజమైన రంగులనే వాడాలని... రసాయన రంగులను ఉపయోగించవద్దని తెలిపారు. ఈ రంగుల వల్ల కంటి, చర్మ సమస్యలతో పాటు శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. ఒకవేళ కంటిలో రంగులు పడితే నీటితో 5 నిమిషాల పాటు శుభ్రంగా కడుక్కోవాలని... ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు. సరోజినీ దేవి కంటి ఆసుపత్రి 24 గంటలు సేవలు అందిస్తుందని తెలిపారు.
ఇదీ చూడండి: హోలీ సందర్భంగా కుస్తీ పోటీలు