ETV Bharat / state

ఎన్​-95 మాస్కుల నుంచి మానసిక ఆసుపత్రి వరకూ..! - డాక్టర్ సుధాకర్​పై హైకోర్టు కామెంట్స్

తమకు సరైన రక్షణ పరికరాలు కల్పించాలంటూ... అడిగిన ఓ ప్రభుత్వ వైద్యుడి జీవితం విషాదంలోకి వెళ్లింది. అండగా ఉండాల్సిన ప్రభుత్వమే.. మానసిక స్థితి సరిగా లేదంటూ.. ముద్ర వేసింది. ఎన్​95 మాస్కులు అడిగినందుకు.. మానసిక వైద్యశాలకు పంపించింది. డాక్టర్ జీవితాన్ని చీకట్లోకి నెట్టింది.

ఎన్​-95 మాస్కుల నుంచి మానసిక ఆసుపత్రి వరకూ..!

author img

By

Published : May 20, 2020, 8:34 PM IST

అసలే కరోనా.. జాగ్రత్తలు తప్పనిసరి.. రక్షణ పరికరాలు కావాలన్నాడో డాక్టర్. ఎన్​95 మాస్కులు ఎందుకు ఇవ్వట్లేదంటూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. అక్కడే మెుదలైంది.. ఆ డాక్టర్ విషాద జీవితం. రోడ్డుపై.. అర్ధనగ్నంగా.. తిరిగేలా.. అతడి జీవితం తయారైంది. చివరకూ మానసిక స్థితే.. బాగాలేదంటూ ముద్రపడింది. ఇంతక విశాఖ డాక్టర్ సుధాకర్ జీవితంలో జరిగిన ఈ విషాద ఘటనలేంటీ?

మాస్కులడిగితే.. తప్పు అన్నారు!

ఆంధ్రప్రదేశ్​ విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి వైద్యుడు సుధాకర్.. కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్యులకు ఎన్​95 మాస్కులు ఇవ్వడం లేదంటూ.. ఆ ప్రభుత్వంపై విమర్శలు చేశాడు. అనుభవం లేని వైద్యులతో ఆపరేషన్లు చేయిస్తున్నారని.. ప్రజాప్రతినిధులు సైతం ఆసుపత్రిని పట్టించుకోలేదని విమర్శించారు. ఈ మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. 8 ఏప్రిల్​ 2020న డాక్టర్ సుధాకర్​ను సస్పెండ్ చేస్తూ.. ఆదేశాలు వెలువడ్డాయి. అప్పుటినుంచి డాక్టర్ సుధాకర్​కు కష్టాలు మెుదలయ్యాయి.

విశాఖలో అరెస్టు..

16 మే 2020న విశాఖలో పోర్టు ఆసుపత్రి ఎదుట అర్ధనగ్నంగా.. డాక్టర్ సుధాకర్​ నిరసన వ్యక్తం చేశాడు. గొడవ చేస్తున్నట్లు స్థానికులు చెప్పగా.. అక్కడికి వెళ్లిన పోలీసులు ఆయనను తాళ్లతో కట్టేశారు. అనంతరం పోలీస్ స్టేషన్​కు అక్కడి నుంచి కేజీహెచ్​కు తీసుకెళ్లారు. సుధాకర్‌ మానసిక పరిస్థితి బాగోలేదని కేజీహెచ్‌ వైద్యులు చెప్పడం వల్ల పోలీసులు ఆయనను ప్రభుత్వ మానసిక వైద్యశాలకు తరలించారు. సుధాకర్​పై 353, 427 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అరెస్టు చేసే సమయంలో డాక్టర్​ను కానిస్టేబుల్ కొట్టిన వీడియో బయటికొచ్చింది. మద్యం మత్తులో డాక్టర్ హల్​చల్ చేసినట్టు విశాఖ సీపీ ఆర్కే మీనా చెప్పడంతోపాటు.. డాక్టర్​ను కొట్టిన కానిస్టేబుల్​ను అదే రోజు సస్పెండ్ చేశారు.

నా కొడుకుకి ప్రాణహాని..

సుధాకర్ తల్లి విశాఖ కమిషనర్​ను కలిసింది. తన కొడుకుకి ప్రాణహాని ఉందని తెలిపింది. కోర్టుకు హాజరుపరిచే సమయంలో తన కుమారుడికి ఏమైనా జరగొచ్చు అంటూ సీపీ దగ్గర కన్నీళ్లు పెట్టుకుంది. కోర్టుకు వెళ్లే సమయంలో తననూ తీసుకెళ్లాలని ఆర్కే మీనాను కోరింది.

రాజకీయ పార్టీల స్పందన

ఆసుపత్రిలో సరైన సదుపాయాలను అడిగిన వైద్యుడిని అరెస్టు చేయడమేంటని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి. వైద్యుడి జీవితాన్ని నాశనం చేశారంటూ.. ఆరోపణలు గుప్పించాయి. తెదేపా, భాజపా, జనసేన.. డాక్టర్​ సుధాకర్​ ఘటనను తీవ్రంగా ఖండించాయి. డాక్టర్ సుధాకర్ ఉదంతంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశాయి. అయితే అధికార పార్టీ మాత్రం.. ​ఏపీ ముఖ్యమంత్రిని డాక్టర్ తీవ్రస్థాయిలో దూషించినట్లు.. అతడు తెదేపాకు కావాల్సిన వ్యక్తి అంటూ ఆరోపించింది.

హైకోర్టుకు.. విషాద గాధ

18 మే 2020, డాక్టర్ సుధాకర్ అరెస్టుపై.. హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. వైద్యుడి హక్కులకు భంగం కలిగించేలా అర్ధనగ్నంగా ఉంచి అరెస్ట్ చేశారంటూ.. హైకోర్టు దృష్టికి విషయం వెళ్లింది. మరోవైపు తెదేపా మహిళా నేత ఇదే విషయంపై హైకోర్టుకు లేఖ రాశారు. సంబంధింత వీడియోను జత చేశారు. వీడియోను పరిశీలించిన హైకోర్టు .. డాక్టర్ సుధాకర్ ఘటనను సుమోటోగా స్వీకరించింది. వైద్యుడిని కోర్టు ముందు హాజరుపరచాలని తెలిపింది. 20 మే 2020న విచారణ చేసిన ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని.. ప్రభుత్వాన్ని ఆదేశించింది. గురువారం సాయంత్రంలోగా వైద్యుడు సుధాకర్ వాంగ్మూలాన్ని సమర్పించాలని స్పష్టం చేసింది. శుక్రవారం ఈ విషయంపై ధర్మాసనం విచారణ చేయనుంది.

జగన్​కు ఐఎంఏ లేఖ

19 మే 2020న.. డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై ఏపీ ముఖ్యమంత్రికి ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) లేఖ రాసింది. సుధాకర్​ పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని తెలిపింది. ముఖ్యమంత్రిపై వైద్యుడు చేసిన వ్యాఖ్యలు సరికాదని.. వైద్యుడి పట్ల ఇలా ప్రవర్తించడం మనోవేదనకు గురి చేస్తోందని జగన్​కు రాసిన లేఖలో పేర్కొంది. పోలీసులపైనా తగిన చర్యలు తీసుకోవాలంది. ఇదే విషయంపై.. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. సుధాకర్‌కు న్యాయం జరగకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేసింది.

ప్రస్తుతం డాక్టర్ సుధాకర్​.. ఓ మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. సరైన వసతులు కావాలంటూ ప్రశ్నించిన ప్రభుత్వ ఉద్యోగి జీవితం అంధకారంలోకి వెళ్లడం విషాదమే.

ఇవీ చూడండి: తొలిగిన అవరోధాలు.. ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.