ఏపీలోని కడప జిల్లా వల్లూరులో కొవిడ్ టీకా వేయించుకున్న కొద్ది నిమిషాలకే ఓ వైద్యురాలు అస్వస్థతకు గురయ్యారు. వైద్యురాలు మేరీ సుజాత కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే ఆమెను కడప రిమ్స్ కు తరలించారు. అయితే... మూడు నెలల క్రితం సుజాత కొవిడ్ బారిన పడి కోలుకుందని మరో వైద్యురాలు లక్ష్మి తెలిపారు.
సుజాత భయంతో టీకా వేయించుకున్నారని.. అందుకే ఈ సమస్య అని అభిప్రాయపడ్డారు. హార్ట్ బీట్, బీపీ అన్ని బాగానే ఉన్నట్లు తెలిపారు. సుజాత టీకా వేయించుకున్న అనంతరం మరో 30 మందికి వ్యాక్సినేషన్ చేశామని.. వారు ఎలాంటి అస్వస్థతకు గురికాలేదని వివరించారు.
ఇదీ చదవండి: 'హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకుసాగుతోంది'