హైదరాబాద్‌లో కరోనా కట్టడిలో వైద్య శాఖ ఎటువంటి చర్యలు చేపడుతోంది..?
కరోనా కట్టడికి వైద్య ఆరోగ్య సహా హైదరాబాద్‌లో వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే చేయడంలో భాగంగా.. జ్వరం, దగ్గు, డయేరియా వంటి లక్షణాలు ఉన్నాయా..ఊపిరిత్తుల వ్యాధులు, గుండెజబ్బులు, క్యాన్సర్, డయాలసిస్ వంటి వ్యాధులు ఉన్నాయా తదితర అంశాలపై వివరాలు సేకరిస్తాం. 0-5 ఏళ్ల వయస్సు, 65 ఏళ్ల వయస్సు ఉన్న వాళ్లు ఎంతమంది ఉన్నారు వంటి వివరాలు ప్రతిరోజూ సేకరిస్తాం.
85 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ప్రైవేట్, బస్తీ దవాఖానాల్లో జ్వరం, జలుబు, దగ్గు, డయేరియా లెక్కలు తీసుకుంటాం. ప్రతిరోజూ 85 పీహెచ్‌సీల్లో 4,239 ఓపీ కేసులు వస్తున్నాయి. అందులో ఏడెనిమిది జ్వరానికి సంబంధించిన కేసులు వస్తున్నాయి. బస్తీ దవాఖానాల్లో ప్రతి రోజూ 3900 నుంచి 4,500ల వరకు ఓపీ కేసులు వస్తున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించిన కేసులు, ఇతరత్ర ఆసుపత్రుల కొవిడ్ కేసులు కూడా సేకరిస్తాం. వీటన్నింటికి సంబంధించిన అడ్రస్‌లను ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపుతాం. ఏవైనా సమస్యలు ఉన్నాయా..ఇంకా టెస్టులు చేయించాలా..అన్న కోణంలో ఆలోచన చేస్తాం.
హైదరాబాద్‌లో ఎన్ని కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు ?
ఇప్పటి వరకు 65 కేంద్రాల్లో చేశాం. మరిన్ని పెంచాలని చూస్తున్నాం. ఎక్కడ కేసులు ఉన్నాయి.. ఎక్కడ జ్వరాలు ఉన్నాయి.. ఆ వివరాలు తీసుకుని టెస్ట్ చేస్తున్నాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు చిన్నగా ఉన్న చోట. కమ్యూనిటీ హాల్స్, పాఠశాలల్లో కూడా యాంటీజెన్ పరీక్షలు చేస్తున్నాం. ఆవిధంగా 85 కేంద్రాల్లో యాంటిజన్ పరీక్షలు నిర్వహిస్తున్నాం.
ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు ఎవరెవరికి చేస్తారు. అందుకు అవసరమైన కిట్లు అందుబాటులో ఉన్నాయా?
యాంటీజెన్ టెస్టులు అవసరమున్న అందరికీ చేస్తాం. ఎన్ని టెస్టులు చేసేందుకైనా ప్రభుత్వం అనుమతిచ్చింది. కిట్లు కూడా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేశాం. సరోజినీదేవి, నిజామియా, నేచర్ క్యూర్ ఆసుపత్రులలో కూడా చేస్తున్నాం. ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలి.
కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి ఎటువంటి చికిత్సలు అందిస్తున్నారు ?
హోం క్వారంటైన్లో ఉన్న వారికి ఎటువంటి చికిత్సలు అందిస్తున్నారు. హోం క్వారంటైన్ అవకాశం లేని వారికి ఎ క్కడ చికిత్స అందిస్తారు. హోం క్వారంటైన్ సాధ్యం కాని వారికోసం ప్రభుత్వం నేచర్ క్యూర్ ఆయుర్వేదం వంటి ప్రాంతాల్లో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. వాటిల్లో బెడ్లు కూడా ఖాళీగానే ఉన్నాయి. చాలా సిబ్బంది దాన్ని వాడుకుంటున్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి డిక్లరేషన్ తీసుకుంటాం. వారికి కిట్స్ అందజేస్తాం.
ట్యాబ్లెట్లు, శానిటైజర్, మాస్కులు, వాటిని వాడే విధంగా ఓ బ్రోచర్, వాటితోపాటు యాప్ డౌన్లోడ్ చేసుకునే విధానం కూడా అందులోనే పొందుపరుస్తాం. ఇప్పటి వరకు 11,700 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. 16,680 మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పూర్తి చేసుకున్నవారు ఉన్నారు. హోం ఐసోలేషన్ సౌకర్యం లేని వారు క్వారంటైన్ సెంటర్లలో 370 మంది చికిత్స పొందుతున్నారు. ఇక్కడ వారికి భోజన వసతి, కషాయం, టీ వంటి ఏర్పాట్లు చేశాం.
ఎంతమంది వైద్య సిబ్బంది ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డారు ?
10 మంది వైద్యులు, 60 నుంచి 70 మంది సిబ్బంది కొవిడ్ బారిన పడ్డారు. చాలా మంది రికవర్ అయ్యారు. కొంతమంది కరోనాను జయించి తిరిగి విధులు నిర్వహిస్తున్నారు.
ఇదీ చూడండి : గూగుల్ డీల్, గ్లాస్, 5జీ... రిలయన్స్ ఏజీఎం హైలైట్స్