ETV Bharat / state

పోస్టల్‌ బ్యాలెట్‌: పోస్టేజ్‌ స్టాంపు రుసుము చెల్లించొద్దు - ghmc elections news

గ్రేటర్​ హైదరాబాద్​ ఎన్నికల్లో పోస్టల్​ బ్యాలెట్​ ఓట్లు వేసేవాళ్లు పోస్టేజ్​ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. సంబంధిత నగదును జీహెచ్ఎంసీ చెల్లిస్తుందని పేర్కొన్నారు.

ghmc elections
పోస్టల్‌ బ్యాలెట్‌: పోస్టేజ్‌ స్టాంపు రుసుము చెల్లించొద్దు
author img

By

Published : Nov 26, 2020, 8:14 AM IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వేసే ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు, కొవిడ్‌ బాధితులు, వృద్ధులు.. పోస్టేజ్‌ స్టాంపు కోసం ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఎన్నికల కమిషన్‌, జీహెచ్‌ఎంసీ అధికారులు స్పష్టం చేశారు. ఓటు వేసిన తర్వాత బ్యాలెట్‌ను రిటర్నింగ్‌ అధికారికి పంపే సమయంలో పోస్టేల్‌ స్టాంపు డబ్బులు ఇవ్వొద్దని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి రుసుమును జీహెచ్‌ఎంసీ చెల్లిస్తుందన్నారు.

పోస్టల్‌ కవర్​పై బీఎన్‌పీఎస్‌ అకౌంట్‌ నంబర్‌ 2019, కస్టమర్‌ ఐడీ 6000014601 పోస్టల్‌ కవర్‌పై ముద్రించి ఉంటుందన్నారు. లేని పక్షంలో సంబంధిత ఓటరు వీటిని రాయాలని అధికారులు సూచించారు.

ఇవీచూడండి: 41 డివిజన్లలో.. 49 మంది నేరచరితులు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.