ETV Bharat / state

"రెవెన్యూ శాఖ రద్దు ఆలోచన విరమించుకోవాలి"

రెవెన్యూ శాఖలను రద్దు చేసి ఇతర శాఖలకు బదిలీ చేయాలనే ఆలోచన ప్రభుత్వం మానుకోవాలని వీఆర్వో సంఘం ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సచివాలయంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమర్​కు వినతిపత్రం అందజేశారు.

author img

By

Published : Aug 26, 2019, 11:27 PM IST

గత ప్రభుత్వాల మాదిరి ఇబ్బందులకు గురిచేయకండి

రెవెన్యూ శాఖలను రద్దు చేసి ఇతర శాఖలకు బదిలీ చేయాలనే ఆలోచనను మానుకోవాలని వీఆర్వో, వీఆర్ఏల ప్రతినిధులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ప్రజలు, ఉద్యోగులకు మంచి చేసేందుకు నూతన చట్టాన్ని తీసుకొస్తే తాము స్వాగతిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు వారు ఐకాసగా ఏర్పడి సచివాలయంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్​కు వినతిపత్రం అందజేశారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో ఈ శాఖ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొందని వీఆర్వో సంక్షేమ రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్​రావు అన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చిన తమను గత ప్రభుత్వాల తరహాలోనే ఇబ్బందులకు గురిచేయవద్దని కోరారు. ఏ శాఖలోనూ విలీనం చేయకుండా.. మరింత బలోపేతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పలు పథకాలను ప్రజల్లోకి తీసుకవెళ్లిన ఘనత తమదేనని చెప్పారు. ఈ నెల 29వ తేదీన జరిగే వీఆర్వో, వీఆర్ఏల ఆత్మగౌరవ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.

ఇదీ చూడండి: ఈటీవీ భారత్​ కథనానికి స్పందన... బాధితులకు కలెక్టర్ ఆసరా​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.