ETV Bharat / state

'పోలీసులు ఒక కేసు పెడితే... రెండు ప్రైవేట్ కేసులు పెట్టాలి' - ap news

అక్రమ కేసులు పెడితే మౌనంగా ఉండొద్దని ఏపీలో తెదేపా శ్రేణులకు పార్టీ అధినేత చంద్రబాబు సూచించారు. పోలీసులు ఒక కేసు పెడితే రెండు ప్రైవేట్ కేసులు పెట్టాలని చెప్పారు. ఫిర్యాదు తీసుకోకుంటే ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేయమని వివరించారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలన్న డీజీపీ మాటలను చంద్రబాబు గుర్తు చేశారు.

పోలీసులు ఒక కేసు పెడితే... రెండు ప్రైవేట్ కేసులు పెట్టాలి: చంద్రబాబు

author img

By

Published : Dec 16, 2020, 11:01 PM IST

తప్పుడు కేసులు పెట్టిన పోలీసులను వదిలేది లేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పోలీసులు కాళ్ల బేరానికి రావాలంటే ప్రైవేట్ కేసులు పెట్టాలని ఏపీలోని పార్టీ శ్రేణులకు సూచించారు. పోలీసులు ఒక కేసు పెడితే... రెండు ప్రైవేట్ కేసులు పెట్టాలని చెప్పారు. తప్పుడు కేసులకు కాలం చెల్లిందన్న ఆయన... ఫిర్యాదు తీసుకోకుంటే ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేయాలని దిశానిర్దేశం చేశారు.

సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని ఏపీ డీజీపీ ఊదరకొడుతున్నారని వ్యాఖ్యానించారు. డీజీపీ సూచనను తెదేపా శ్రేణులు వినియోగించుకోవాలని వివరించారు. ఫిర్యాదులు తీసుకోని పోలీసులపై అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

పోలీసులు ఒక కేసు పెడితే... రెండు ప్రైవేట్ కేసులు పెట్టాలి: చంద్రబాబు

ఇదీ చదవండి: ఓటుకు నోటు కేసులో నిందితుడు ఉదయ్‌సింహా అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.