ETV Bharat / state

కర్ణాటకలో వచ్చిన ఫలితమే తెలంగాణలో వస్తుంది: డీకే శివకుమార్‌

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 25, 2023, 3:24 PM IST

Updated : Nov 25, 2023, 3:39 PM IST

DK Shiva Kumar Election Campaign Telangana : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. కర్ణాటకలో 5 గ్యారంటీలు అమలు అవతున్నాయని.. బీఆర్ఎస్ నాయకులు వచ్చి చూస్తే తెలుస్తుందని సవాలు విసిరారు. చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని తెలిపారు.

DK Shiva Kumar on Congress Party Development
DK Shiva Kumar Election Campaign Today

DK Shiva Kumar Election Campaign Telangana : కర్ణాటకలో వచ్చిన ఫలితమే తెలంగాణలో వస్తుందని కర్ఱాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తెలిపారు. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం, సమష్టి నాయకత్వం ఎక్కువని అన్నారు. హైదరాబాద్​లోని ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేశమే కాదు ప్రపంచమంతా తెలంగాణ ఎన్నికల వైపు చూస్తోందని చెప్పారు. తాను తెలంగాణలో అనేక నియోజకవర్గాల్లో తిరిగానని.. బీఆర్ఎస్(BRS) పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు.

DK Shiva Kumar on Congress Party Development : తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ(Soniaya Gandhi)కి బహుమతి ఇచ్చే అవకాశం వచ్చిందని డీకే శివకుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పాలన కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో డిసెంబర్ 9న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్(Congress) ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కర్ణాటక రైతుల(KARNATAKA FARMERS)కు తమ ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇవ్వడం ప్రారంభించామని వెల్లడించారు.

కేసీఆర్​ను ఓడించి - పర్మినెంట్​గా ఫాంహౌస్​కు పంపించాలి : డీకే శివకుమార్

DK Shiva Kumar Comments on KCR : కర్ణాటకలో నిత్యవసర ధరలు పెరిగాయని ఆరోపణ చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు తమ రాష్ట్రం వచ్చి చూడాలని శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రజలకు 5 గ్యారంటీలు అమలు అవుతున్నాయని స్పష్టం చేశారు. రాష్ట్రం ఇస్తే పార్టీని కాంగ్రెస్​లో విలీనం చేస్తానని మాట తప్పారని కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉందని.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో అవసరం ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రజలకు అనుగుణంగా పథకాలు ఉంటాయని తెలిపారు.

DK Shivakumar Speech in Congress Bus Yatra : తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్​ పట్ల కృతజ్ఞత చూపాలి : డీకే శివకుమార్​

"మా పార్టీ గెలిస్తే.. రియల్‌ ఎస్టేట్‌ పడిపోతుందనేది అసంబద్ధ వాదన. హైదరాబాద్‌ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు. చంద్రబాబు, వైఎస్‌ఆర్‌ హయాంలోనూ హైదరాబాద్‌ అభివృద్ధి చెందింది. కాంగ్రెస్‌ పార్టీ ఏ నిర్ణయమూ ఏకపక్షంగా తీసుకోదు. పార్టీ కోసం కష్టపడిన అందరికీ అవకాశాలు వస్తాయి. టికెట్‌ రాని నేతలకు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తాం. కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలిచిన మరుసటిరోజు నుంచే ఐదు గ్యారంటీలు అమలు చేస్తున్నాం."- డీకే శివకుమార్, కర్ణాటక ఉపముఖ్యమంత్రి

DK Shiva Kumar Telangana Tour Today : కర్ణాటకలో పాలన సెక్రటేరియట్ నుంచి నడుస్తే.. తెలంగాణ పాలన ఫామ్ హౌజ్ నుంచి నడుస్తోందని డీకే శివకుమార్ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలను కొనడంలో కేసీఆర్ మంచి నైపుణ్యం ఉన్న వ్యక్తి అని ఆరోపించారు. గత రెండు ఎన్నికలుగా ఎమ్మెల్యేను కొనడంలో ఆయన విజయం సాధించారని విమర్శించారు. కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి ఎన్నుకునే విషయంలో అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని తెలిపారు. హైదరాబాద్, బెంగుళూరు నగరాలు దేశానికి కవల పిల్లలు వంటివని శివకుమార్ అన్నారు. చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధి కోసం పాటుపడ్డారని గుర్తు చేశారు.

కర్ణాటకలో వచ్చిన ఫలితమే తెలంగాణలో వస్తుంది

Telangana Congress Vijayabheri Bus Yatra : నేడు సంగారెడ్డి, మెదక్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ బస్సు యాత్ర.. ముఖ్య అతిథిగా మల్లికార్జున ఖర్గే

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే.. డిప్యూటీ సీఎంగా డీకే.. మే 20న ప్రమాణం!

Last Updated : Nov 25, 2023, 3:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.