రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మర్యాదపూర్వకంగా కలిశారు. దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చానని ఆమె తెలిపారు.
"జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపా విజయం సాధించడం ఖాయం. ఎన్నికల్లో లబ్ధికోసమే తెరాస నాయకులు వరద బాధితులకు పదివేల ఆర్థికసాయం ప్రకటించారు. నిజమైన బాధితులకంటే తెరాస కార్యకర్తల జేబుల్లోకే డబ్బులు వెళ్లాయి. వరద బాధితుల పేరుతో రూ.550 కోట్ల ప్రజాధనాన్ని కార్యకర్తలకు దోచిపెట్టారు. ఎన్నికలప్పడు ప్రజలను మభ్యపెట్టడం తెరాసకు బాగా తెలుసు. మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోమనడం ఇందులో భాగమే. బాధితుల నుంచి ఆధార్, బ్యాంకు వివరాలు సేకరించి ఆకౌంట్లలో డబ్బులు ఎందుకు వేయలేదు. ఎన్నికల ముందు ప్రజలకు ఆశ కల్పించి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు." -డీకే అరుణ, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు