పోతిరెడ్డిపాడు అంశంపై నిరసిస్తూ... మాజీ మంత్రి డీకే అరుణ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో దీక్ష చేపట్టారు. ఏపీ సీఎం జగన్ తీసుకొచ్చిన 203జీవోను తక్షణం నిలిపివేయాలని అన్నారు. నీటి కేటాయింపు విషయంలో తెలంగాణ రాష్ట్రానికి చాలా అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు నుంచి నీటి కేటాయింపు తరలింపును కేసీఆర్ అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు.
ఉమ్మడి నల్గొండ, పాలమూరు,రంగారెడ్డి జిల్లాల్లో ఏ ఒక్కరైతుకు నష్టం జరిగినా ఊరుకోం... ముఖ్యమంతి వెంటనే ఏపీ సీఎంతో చర్చలు జరిపి జీవోను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాం... - డీకే అరుణ, మాజీ మంత్రి
ఇదీ చూడండి: కొత్తపేట మార్కెట్లో ఉద్రిక్తత...భాజపా నేతపై చేయి చేసుకున్న సీఐ