తగ్గిన డీజేల హోరు: డిసెంబరు 31 రాత్రి ఈవెంట్లను పోలీసులు నిషేధించారు. ఆనందోత్సాహాల నడుమ కొత్త ఏడాదిని ఆహ్వానిద్దామని వేడుకలకు ప్రణాళికలు వేసుకున్నవారికి నిరాశే ఎదురైంది. డీజేలు, ఎలక్ట్రిక్, లైటింగ్ తదితర పనుల్లో నిమగ్నమయ్యేవారికి ఉపాధి పోయింది.
- నగరంలో డీజేలు: 200 మంది
- సంపాదన: రూ.3లక్షల వరకు
- కోల్పోయిన వ్యాపారం: రూ.6 కోట్లు
నుమాయిష్: ఏటా నాంపల్లి వద్ద జరిగే ఎగ్జిబిషన్‌లో దేశంలోని పలు రాష్ట్రాల వ్యాపారులు స్టాళ్లు ఏర్పాటు చేస్తుంటారు. ప్రదర్శన జరగకపోవడంతో వారంతా నిరాశ చెందారు. మార్చిలో నిర్వహణకు అనుమతి లభిస్తుందని ఆశిస్తున్నారు.
- ఏర్పాటయ్యే స్టాళ్లు: 2400
- సందర్శకులు: 16 లక్షల మంది
- వ్యాపారం: రూ.500 కోట్లు
పుస్తక ప్రదర్శన: హైదరాబాద్ పుస్తక ప్రదర్శన వాయిదా పడటంతో లక్షలాది పాఠకులు నిరాశ చెందారు. పది రోజుల పాటు నిర్వహించే ప్రదర్శనలో దేశ విదేశాలకు చెందిన పుస్తకాలు లభ్యమయ్యేవి. మార్చిలోనైనా అనుమతిస్తారని పాఠకులు ఆశిస్తున్నారు.
- ఏటా ఏర్పాటయ్యే స్టాళ్లు: 350
- సందర్శకులు: 10 లక్షల మంది
- అమ్ముడయ్యే పుస్తకాల విలువ: రూ.3కోట్లు
కోట్లాది రూపాయల నష్టం:
ఒక్క డిసెంబరులోనే ఈవెంట్లు అధికంగా జరుగుతుంటాయి. శుక్ర, శని, ఆదివారాల్లో మరీ ఎక్కువ. నగరంలో సుమారు 100 పబ్‌లు ఉండగా వేడుకలకు దేశీయ, విదేశీ డీజేలను పిలిపిస్తారు. ఒక్కో పబ్ సామర్థ్యం 300-500 వరకు ఉంటుంది. వివిధ రకాల ప్యాకేజీలతో ఆకట్టుకొనేవారు. కరోనా కారణంగా అన్నింటికీ బ్రేకు పడింది. ఈ రంగం కోట్లాది రూపాయలు నష్టపోయింది.- అరుణ్, ఈవెంట్స్ నిర్వాహకులు
ఇదీ చూడండి: కరోనా స్ట్రెయిన్ పట్ల ఆందోళన అనవసరం: గవర్నర్