హైదరాబాద్‌లో దీపావళి శోభ సంతరించుకుంది. దీపావళి అంటే.. పటాకుల మోత మోగించాల్సిందే. దీపావళి అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది కాకరపూల వెలుగులు, టపాసుల ఢాం..ఢాం శబ్దాలు. చిన్నాపెద్దా తేడా లేకుండా టపాసులను కాలుస్తుంటారు. గతేడు పటాకులపై ఆంక్షలు ఉండగా... ఈసారి అవేవీ లేకపోవడంతో... పెద్ద సంఖ్యలో పటాకుల దుకాణాలు వెలిశాయి. దీపావళి సందర్భంగా మార్కెట్‌లోకి రకరకాల పటాకులు అందుబాటులోకి వచ్చాయి. కాకరవత్తులు, చిచ్చుబుడ్లు, భూచక్రాలు, పెన్సిల్స్, తాళ్లు, థౌజండ్ వాలా, రాకెట్లు, లక్ష్మీ బాంబులు, సుతీల్, పిట్ట బాంబులు, తోక పటాసులు, వెన్నముద్దలు, పాము బిళ్లలు, అగ్గిపెట్టెలు, రంగరంగుల క్రాకర్స్‌ను మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.
బొమ్మల కొలువులు
దీపావళి రోజున ప్రతి ఇల్లు దీపాలంకరణతో కళకళలాడాల్సిందే. చీకటికి వెలుగులు తెచ్చే పండుగగా దీపావళి పండుగను జరుపుకుంటారు. పర్వదినం రోజు కోసం దీపాల ప్రమిదలు, బొమ్మలు, పూజాసామాగ్రి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వివిధ ఆకృతుల్లో మట్టి ప్రమిదలు ఆకట్టుకుంటున్నాయి. బొమ్మల కొలువుల కోసం బొమ్మలు కొలువుదీరాయి.
జోరుగా స్వీట్ల అమ్మకాలు
నగరంలోని మిఠాయిల దుకాణాలన్నీ కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. రకరకాల స్వీట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పండగ సందర్భంగా సరికొత్త మిఠాయిలను అందుబాటులోకి తెచ్చారు. పండక్కి కొన్ని రోజుల ముందు నుంచే రకరకాల రుచులను సిద్ధం చేసి కొనుగోలుదారులకు అందిస్తున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేకంగా స్వీట్లను అందుబాటులో ఉంచారు.
ఇదీ చూడండి: Dry Fruits Sales in diwali: దీపావళి సందర్భంగా డ్రై ఫ్రూట్స్‌కి పెరిగిన డిమాండ్
pratidhwani: హరిత బాణసంచాతో కలిగే ప్రయోజనం ఏంటి?
దీపావళి కోసం స్పెషల్ గోల్డెన్ స్వీట్- కిలో రూ.11వేలు!
పండగ వేళ ప్రపంచ రికార్డుకు సిద్ధమైన అయోధ్య
'టపాసులు లేకుండానే దీపావళి.. మెజార్టీ ప్రజల ఆలోచన ఇదే!'
దీపావళి స్పెషల్ స్వీట్ కిలో రూ.25వేలు.. ఎందుకంత ధర?
eco friendly Diwali: మారుతున్న ఆలోచన.. గ్రీన్ క్రాకర్స్వైపు మొగ్గు