ETV Bharat / state

పెండింగ్​ బిల్లులపై త్వరలో నిర్ణయం తీసుకుంటా: గవర్నర్ తమిళిసై

Diwali celabrations at raj bhavan రాజ్​భవన్​లో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. పండుగ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్​... పెండింగ్ బిల్లులపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. మీడియాతో ముచ్చటించిన తమిళిసై... పలు ఆసక్తి కర విషయాలు వెల్లడించారు.

Diwali celabrations at raj bhavan hyderabad
గవర్నర్ తమిళిసై
author img

By

Published : Oct 24, 2022, 3:25 PM IST

Diwali celabrations at raj bhavan అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులకు ఆమోదం తెలిపే అంశం పూర్తిగా తన పరిధిలో ఉంటుందని గవర్నర్ తమిళిసై అన్నారు. రాజ్ భవన్​లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్న గవర్నర్​తో మీడియా ప్రతినిధులు ముచ్చటించారు. గవర్నర్​గా తనకు విస్తృత అధికారాలు ఉంటాయని తమిళిసై తెలిపారు. గవర్నర్​గా తనకు ఉన్న పరిధికి లోబడే నడుచుకుంటున్నానని పునరుద్ఘాటించారు.

పెండింగ్​లో ఉన్న బిల్లులను త్వరలోనే పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని... గవర్నర్​గా తన బాధ్యతను ఎరిగి నిర్ణయాలు వెలువరిస్తానని పేర్కొన్నారు. అంతకు ముందు రాజ్​భవన్​లో దీపావళి వేడుకలు వైభవంగా జరిగాయి. పండుగ సందర్భంగా గవర్నర్ దంపతులను కలిసేందుకు సామాన్యులు తరలివచ్చారు. వారిని గవర్నర్ దంపతులు కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్రంలోని తెలంగాణ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు గవర్నర్‌ తమిళిసై వెల్లడించారు. ఎవరైతే బూస్టర్ డోస్ తీసుకోలేదో, వెంటనే తీసుకోవాలని సూచించారు. మంచి ఆరోగ్యకరమైన భోజనం చేస్తూ... జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి:

అభయారణ్యంలో ఆ వలస జీవుల.. వేదన అరణ్యరోదన

'ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న తెరాసకి యువత అండగా నిలబడాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.