సికింద్రాబాద్ ఆవరణలో దాతల సహాయంతో ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యుల కోసం గాంధీ సూపరిండెంట్ రాజారావుకు 1000 పీపీఈ కిట్లను అందించారు. తెలంగాణలోని గాంధీ ఆసుపత్రి వైద్యులు కరోనా నివారించే విషయంలో అద్భుతంగా పని చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
గతంలో గాంధీ ఆస్పత్రిలో వైద్యులు సేవలు అందించినప్పటికీ చిన్న విషయం కూడా వివాదంగా మారేదని అప్పటికీ, ఇప్పటికీ వైద్యుల తీరు ఎంతో గొప్పగా ఉందని అన్నారు. కరోనా వైరస్ నివారణకు కేరాఫ్ అడ్రస్‌గా గాంధీ ఆసుపత్రి మారిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: హైదరాబాద్‌లోనూ ఆయువు తీసే వాయువులెన్నో?