ప్రస్తుత విపత్కర పరిస్థితులలో ఆక్సిజన్ దొరకక ప్రాణాలు పోతోన్న వారి పరిస్థితి దయనీయమని హైదరాబాద్కు చెందిన 'సేవ్ ది చైల్డ్ సంస్థ' పేర్కొంది. ఆపత్కాలంలో తమ వంతు సాయంగా ఆసుపత్రులకు ఆక్సిజన్ సాంద్రత పరికరాలను అందజేసినట్లు సంస్థ సభ్యులు పేర్కొన్నారు. కరోనా రెండో దశలో కేసులు పెరిగి.. ఆక్సిజన్ అందక ఇబ్బందులకు గురవుతోన్న బాధితులకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.
సరోజినీ దేవి, నీలోఫర్ ఆసుపత్రులకు సంస్థ సభ్యులు.. ఆక్సిజన్ సాంద్రత పరికరాలను అందజేశారు. తెలంగాణతో పాటు ఏపీలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ పరికరాలను అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆపత్కాలంలో మానవతావాదులంతా ముందుకొచ్చి కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలని వారు కోరారు.
ఇదీ చదవండి: లాక్డౌన్, అకాల వర్షాలు: మామిడి పంటకు అపార నష్టాలు