హైదరాబాద్‌లోని ఇందిరానగర్‌లోని డబ్బింగ్ ఆర్టిస్టు యూనియన్ కార్యాలయంలో పేద కళాకారుల కుటుంబాలకు భారతీ శంకర పీఠం, శ్రీసాయి శాంతి సహాయ సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అన్నవరపు తిరుపతి మూర్తి కుమారుడు దత్త ఆంజనేయశాస్త్రి పుట్టిన రోజు సందర్భంగా ఆయన సతీమణి లలిత డబ్బింగ్ యూనియన్ సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాకారులకు సరుకులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో డబ్బింగ్ యూనియన్ సెక్రటరీ దామోదర్, వైస్ ప్రెసిడెంట్ లెలిన చౌదరి, కార్యవర్గ సభ్యులు మంగరాజు, ఆర్‌సీఎం రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Vaccination: టీకా తీసుకున్నవారి నుంచి వైరస్ రాదా?