లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ కొత్తపేటలోని పీవీటీ మార్కెట్ బంద్ కావడం జరిగింది. ఆ కారణంగా పని లేక ఇబ్బంది పడుతున్న సుమారు 600 మందికి సిబ్బందికి నిత్యావసరాలను మార్కెట్ కమిటీ సభ్యులు అందజేశారు.
మరో 600 మంది సిబ్బందికి అందించడానికి ప్రణాళిక చేస్తున్నట్లు పీవీటీ మార్కెట్ ఛైర్మన్ ధనుంజయ్ అన్నారు. కరోనా వ్యాధి పట్ల ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు.
ఇదీ చూడండి : 'త్వరలో ఆన్లైన్లో ఫిట్నెస్ శిక్షణ తరగతులు'