హైదరాబాద్ జవహర్‌నగర్‌లో ఎలక్ట్రికల్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు పాల్గొని ఉచిత పుస్తకాల పంపిణీ నిర్వహించారు.ప్రతి ఒక్కరూ సమాజ సేవకు పాటుపడి పేద విద్యార్థులకు సాయం అందించే దిశగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని దేవులపల్లి ప్రభాకర్ రావు పిలుపునిచ్చారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు బోధించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల అధ్యాపకులు ఈశ్వరమ్మ, ఉపాధ్యాయులు, ఎలక్ట్రికల్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్‌కు హోంమంత్రి అమిత్ షా