ETV Bharat / state

వచ్చే నెల 20 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

వచ్చే నెల 20 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లాలకు 50 లక్షల చీరలు చేరాయి. ఎంగిలిపూల పండుగ సెప్టెంబర్​28న అవుతుండగా అంతకంటే ఒకరోజు ముందుగానే పంపిణీ పూర్తి చేయాలని సర్కార్​ భావిస్తోంది. 18 ఏళ్లు దాటిన పేద మహిళలకు ప్రభుత్వం మూడేళ్లుగా చీరలు అందిస్తోంది.

బతుకమ్మ చీరలు
author img

By

Published : Aug 29, 2019, 5:03 AM IST

వచ్చే నెల 20 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

బతుకమ్మ పండుగను పురస్కరించుకుని 1.02 కోట్ల మంది ఆడపడుచులకు చీరలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల 20 నుంచి చీరల పంపిణీ ప్రారంభం కానుంది. ఎంగిలిపూల పండుగ సెప్టెంబర్​28న అవుతుండగా అంతకంటే ఒకరోజు ముందుగానే పంపిణీ పూర్తి చేయాలని సర్కార్​ భావిస్తోంది. రూ.313 కోట్లతో చీరలను సిరిసిల్లలో నేత కార్మికులు తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉత్పత్తి అయిన వాటిలో 50 లక్షల చీరలను జిల్లాలకు పంపించారు. మిగతావి నెలాఖరుకు పూర్తి కానున్నాయి.

చీరకు రూ.280

కలెక్టర్ల పర్యవేక్షణలో గ్రామస్థాయిలో వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, రేషన్​ డీలర్లతో కూడిన కమిటీ ఆధ్వర్యంలో మహిళా సంఘాల ద్వారా బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు. పట్టణాలు, నగరాల్లో పుర, నగరపాలక సంస్థల పరిధిలోని మహిళా సంఘాల ద్వారా అందిస్తారు. బతుకమ్మ చీరలను ఈసారి మరింత నాణ్యతతో అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వంద డిజైన్లలో వీటిని తయారు చేయించారు. ఒక్కో చీరకు సగటున రూ.280 వ్యయమైంది.

ఇదీ చూడండి :హెల్మెట్​ పెట్టుకుంటేనే జైల్లోకి.

test file from feedroom
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.