ETV Bharat / health

రాత్రివేళ ఇవి తింటే ఆరోగ్యానికి ముప్పు తప్పదట! - మీ డిన్నర్​లో ఉన్నాయా? - AVOIDE THESE FOODS IN DINNER

- అజీర్తి నుంచి డయాబెటిస్ దాకా ఎన్నో సమస్యలు

Avoide These Foods in Dinner
Avoide These Foods in Dinner (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : Nov 8, 2024, 8:31 AM IST

Updated : Nov 9, 2024, 9:20 AM IST

Avoide These Foods in Dinner : రాత్రిభోజనం చాలా ముఖ్యమైన అంశం. శరీరానికి కదలిక ఎక్కువగా ఉండదు కాబట్టి.. లైట్ ఫుడ్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తారు. అంతేకాదు.. రాత్రి 7లోపే డిన్నర్ కంప్లీట్ చేయాలని కూడా చెప్తారు. కానీ.. చాలా మంది 10 గంటల దాకా తినరు. టీవీ చూస్తూనో, ఫ్యామిలీ మెంబర్స్​తో మాట్లాడుతూనో టైమ్ పాస్ చేస్తారు. అంతేకాదు.. ఈ గ్యాప్​లో ఏవైతే రాత్రివేళ తినకూడదో, చక్కగా అవే తినేస్తుంటారు! దీనివల్ల పలు ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

చాక్లెట్, ఐస్​క్రీమ్..

రాత్రివేళలో చాలా మంది స్వీట్స్ తింటుంటారు. కొందరు టైమ్​ పాస్​కు తినేస్తుంటే.. ఇంకొందరు తీపి పదార్థాలు తింటే చక్కగా నిద్రొస్తుందని భావిస్తుంటారు. కానీ.. నైట్​ ఇలా చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు తినకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పడుకునే ముందు స్వీట్స్ తింటే.. వాటిలోని షుగర్స్ రక్తంలో కలిసిపోయి, శరీరంలోని శక్తిని క్షీణింపజేస్తాయట. నిద్ర డిస్ట్రబ్ చేసే అవకాశం కూడా ఉంటుందట. నిత్యం ఇలా నిద్రించడానికి ముందు స్వీట్స్ తినడం వల్ల.. టైప్​-2 డయాబెటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుందని "Journal of Clinical Endocrinology and Metabolism" లో పబ్లిష్ అయిన ఓ అధ్యయనం చెబుతోంది.

పిజ్జా, బర్గర్..

ఐస్‌క్రీమ్స్, కేక్స్ మాత్రమే కాదు.. కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే పిజ్జా, బర్గర్ వంటివి కూడా రాత్రివేళ తీసుకోకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఫుడ్ తినడం వల్ల కడుపు నిండుగా అనిపించేలా చేస్తాయట. దీంతో.. ఒక్కోసారి జీర్ణ క్రియ మందగించి, డైజెషన్ ప్రాబ్లమ్ వస్తుంది. దీంతో ఉదయం బద్ధకంగా అనిపిస్తుంది.

కెఫీన్..

రాత్రిళ్లు చాలా మంది కాఫీ, టీ తాగుతుంటారు. ఇవి తీసుకోవడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే కెఫీన్.. జీర్ణవ్యవస్థలో ఆమ్లత్వం మరింతగా పెంచే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇవేకాకుండా.. కూల్‌డ్రింక్స్, నిమ్మజాతి పండ్ల రసాల్లో కూడా ఆమ్లత్వం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రాత్రిపూట వీటిని తాగకపోవడమే ఉత్తమం.

ప్రొటీన్..

డిన్నర్ గట్టిగా దంచేవాళ్లు కూడా చాలా మందే ఉంటారు. చికెన్, మటన్ తో సుష్టుగా భోంచేసి బెడ్ ఎక్కేస్తుంటారు. అయితే.. పడుకోవడానికి ముందు ఇలా ప్రొటీన్లు అధికంగా ఉండే ఫుడ్ ఎక్కువ మొత్తంలో తినడం వల్ల కడుపు నిండుగా ఉండి ఇబ్బందిగా అనిపిస్తది. జీర్ణక్రియ సైతం సాఫీగా సాగదు. తద్వారా అజీర్తి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. అందువల్ల.. రాత్రివేళ ప్రొటీన్ ఎక్కువగా ఉండే మాంసాహారు, ఆహార పదార్థాలు తక్కువగా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

ఇవి కూడా..

మసాలాలు నషాళానికి తాకితే ఎంతో హాయిగా ఉంటుంది చాలా మందికి. కానీ.. ఇలాంటి స్పైసీ ఫుడ్స్ నైట్ తీసుకోకపోవడం మంచిదన్నది నిపుణుల మాట. ఇంకా.. ఫ్రూట్ ఫ్లేవర్స్‌తో తయారు చేసిన పెరుగు సైతం రాత్రుళ్లు అంత శ్రేయస్కరం కాదట. ఇందులో కూడా షుగర్స్ అధికంగా ఉంటాయని, అవి ఆరోగ్యానికి హాని చేస్తాయని చెబుతున్నారు. అందుకే.. ఇంట్లో తయారు చేసుకునే పెరుగు మంచిదట.

Last Updated : Nov 9, 2024, 9:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.