Mohammad Nabi Retirement : అఫ్గానిస్థాన్ సీనియర్ ప్లేయర్ మహ్మద్ నబీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని డిసైడ్ అయ్యాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత నబీ వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకోనున్నాడు. తన నిర్ణయాన్ని నబీ ఇప్పటికే అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డుకు తెలిపాడు. తాజాగా ఈ విషయాన్ని అఫ్గాన్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యుటివ్ నసీబ్ ఖాన్ ధ్రువీకరించారు.
'ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత నబీ వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలకాలని డిసైడ్ అయ్యాడు. కొన్ని నెలల ముందే నబీ తన నిర్ణయాన్ని బోర్డుకు చెప్పాడు. తన నిర్ణయాన్ని బోర్డు గౌరవవిస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత నబీ వన్డేలకు ముంగింపు పలికినా, టీ20 ఫార్మాట్లో ఆడతాడని ఆశిస్తున్నా' అని నసీబ్ ఖాన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా, 39ఏళ్ల నబీ అఫ్గాన్ జట్టులో అత్యంత సీనియర్ ప్లేయర్. అతడు 2009లో వన్డే మ్యాచ్‌తోనే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. దాదాపు 15ఏళ్ల కెరీర్లో నబీ 165 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. అందులో 3537 పరుగులు చేయగా, 171 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు సెంచరీలు కూడా నమోదు చేశాడు.
కెరీర్ అరుదైన రికార్డు
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ఆల్‌రౌండర్ల విభాగంలో అగ్రస్థానం దక్కించుకున్న అత్యధిక వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బంగ్లా ఆల్‌రౌండర్ షకీబల్ హసన్‌ను వెనక్కినెట్టి నబీ టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు. అప్పటికి నబీ వయసు 39 ఏళ్ల 43 రోజులు. అంతకుముందు 2015లో శ్రీ లంక ప్లేయర్ తిలకరత్నె దిల్షాన్ (38 ఏళ్ల 8 నెలలు) ఈ లిస్ట్‌లో టాప్ పొజిషన్ దక్కించుకున్నాడు.
Congratulations Team Afghanistan 🇦🇫💪🫡@MohammadNabi007 @Hashmat_50 @rashidkhan_19 @ACBofficials pic.twitter.com/B9jUiOvWPt
— 𝐃𝐚𝐰𝐥𝐚𝐭 𝐙𝐚𝐝𝐫𝐚𝐧 (@DawlatZadranDK) November 6, 2024
Nabi IPL Career : 2017లో నబీ తొలిసారి ఐపీఎల్లో మ్యాచ్ ఆడాడు. సన్‌రైజర్స్ తరఫున నబీ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబయి ఇండియన్స్ జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. అడపాదడపా ఇన్నింగ్స్ తప్పా, నబీ ఐపీఎల్లో భారీగా ఆకట్టుకున్న ఇన్నింగ్స్ ఆడలేదు.
వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ - ఆ స్టార్ క్రికెటర్ 1739 రోజుల రికార్డు బ్రేక్
మెగాటోర్నీలో అఫ్గానిస్థాన్ హ్యాట్రిక్ విక్టరీ, చిత్తుగా ఓడిన నెదర్లాండ్స్