నాగార్జున విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ దూరవిద్య పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌పై దూరవిద్య కేంద్రం సంచాలకులు స్పందించారు. నిన్న రాత్రి హైదరాబాద్ జగద్గిరిగుట్టలో ఏఎన్‌యూ డిగ్రీ, పీజీ పరీక్షల్లో జరిగిన మాస్‌కాపీయింగ్ ఘటనపై అధికారులతో నివేదిక తెప్పించుకుంటున్నట్లు సంచాలకులు సుమంత్ తెలిపారు. మాస్ కాపీయింగ్ జరిగిన పరీక్షా కేంద్రాన్ని రద్దు చేస్తున్నట్లు సుమంత్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు చేపడతామన్నారు.
ఇదీ చదవండిః చీకట్లో డిగ్రీ దూర విద్య పరీక్షల మాస్‌కాపీయింగ్