ETV Bharat / state

వెలగపూడిలో రణరంగం.. స్వాగత తోరణం నామకరణంలో విభేదాలు - Andhra Pradesh Latest News

ఏపీ రాజధాని గ్రామమైన వెలగపూడిలో ఎస్సీల్లోని రెండు వర్గాల మధ్య ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో సోమవారం గ్రామం అట్టుడికిపోయింది. రోజంతా రెండు వర్గాల ఆందోళనలు, బైఠాయింపులు, నినాదాలతో రణరంగాన్ని తలపించింది. పోలీస్‌ బందోబస్తు కొనసాగుతున్నా.. ఇంకా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన వెనక ఎంపీ నందిగం సురేశ్‌ ప్రోద్బలం ఉందంటూ ఓ వర్గం ఆరోపిస్తోంది. గ్రామాన్ని సందర్శించిన హోంమంత్రి మేకతోటి సుచరిత ఎదుట నిరసన తెలిపింది.

Hyderabad latest news
వెలగపూడిలో రణరంగం.. స్వాగత తోరణానికి పేరుపెట్టే విషయంలో విభేదాలు
author img

By

Published : Dec 29, 2020, 8:10 AM IST

ఆంధ్రప్రదేశ్​ రాజధాని వెలగపూడి గ్రామంలోని ఎస్సీకాలనీలో కొత్తగా వేసిన సిమెంటు రహదారి ప్రారంభంలో నిర్మించతలపెట్టిన స్వాగత తోరణానికి (ఆర్చీ) పేరు పెట్టే విషయమై కాలనీవాసుల మధ్య కొన్ని రోజులుగా భేదాభిప్రాయాలు వచ్చాయి. తొలుత శనివారం రెండు వర్గాల మధ్య చర్చలు జరిగాయి. ఓ వర్గం వారు బాబూజగ్జీవన్‌రాం పేరు పెట్టాలనగా మరో వర్గం అభ్యంతరం తెలిపింది. దీనిపై అదేరోజు ఘర్షణ జరగ్గా పోలీసులు సర్దిచెప్పి పంపించారు. మరోసారి చర్చించడానికి ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో రెండు వర్గాలు ఒకచోటకు చేరగా.. విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. పరస్పరం రాళ్లు, ఇటుక పెళ్లలు విసురుకున్నారు.

ఇంట్లో ఉన్న మహిళ మృతి

ఈ ఘర్షణ సమయంలో మరియమ్మ (50) అనే మహిళ తన ఇంటి ముందు అంట్లు తోముకుంటుండగా రాళ్లు వచ్చి తగిలాయి. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆసుపత్రికి తరలించగా అర్ధరాత్రి చనిపోయింది. ఆమెకు భర్త దావీదు, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈ దాడిలో మరో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా, 30 మంది క్షతగాత్రులయ్యారు. మరియమ్మ మృతితో ఆమె వర్గీయులు కోపోద్రిక్తులయ్యారు. తెల్లవారుజామున మృతదేహాన్ని రోడ్డుపైకి తెచ్చి నిరసనకు దిగారు. మృతురాలి కుటుంబ సభ్యులను, క్షతగాత్రులను పరామర్శించడానికి రాష్ట్ర హోంమంత్రి సుచరిత ఉదయం వెలగపూడి వెళ్లారు. ఆమె వెంట బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌, వేమూరు ఎమ్మెల్యే నాగార్జున వచ్చారు. ఎంపీ వచ్చారని తెలుసుకున్న బాధిత వర్గం భగ్గుమంది. ఘర్షణకు కారకుడైన ఎంపీతో కలిసి ఎలా వచ్చారంటూ మంత్రిని ప్రశ్నించారు. ‘గో బ్యాక్‌ సురేశ్‌’ అంటూ నినదించారు. ఆయన వైపు దూసుకెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.

బాధిత కుటుంబాన్ని సీఎంతో కలిపిస్తా: మంత్రి సుచరిత

ఆ రాష్ట్ర మంత్రి సుచరిత బాధితురాలి కుటుంబ సభ్యులతో, ఆ వర్గం నాయకులతో మాట్లాడారు. మరిమయ్మ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని, కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘కలిసి ఉండాల్సిన ఎస్సీలను విపక్ష నేత చంద్రబాబు మాల, మాదిగలుగా విడదీయాలని చూస్తున్నారు. మృతురాలి కుటుంబీకులను సీఎం జగన్‌ వద్దకు తీసుకెళ్తా. ఆ కుటుంబానికి తక్షణ సాయంగా రూ.10 లక్షలు ఇవ్వాలని సీఎం సూచించార’ని సుచరిత తెలిపారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారని చెప్పారు. అంబేడ్కర్‌, జగ్జీవన్‌రాం ఇద్దరూ మహానేతలేనని, మనమధ్య విభేదాలకు విగ్రహాలు, ఆర్చీలు కారణం కాకూడదన్నారు. మంత్రి పరామర్శ తర్వాత రాత్రి మరియమ్మ భౌతిక కాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమరావతిలోని ఆసుపత్రికి తరలించారు.

నేతలకు నిరసన సెగ

మంత్రి సుచరిత వచ్చి వెళ్లిన తర్వాత తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ గ్రామానికి వచ్చారు. వారికీ నిరసన ఎదురైంది. ఎంపీని పదవి నుంచి తప్పించాలని, శ్రీదేవిని పార్టీ నుంచి తొలగించాలని, తుళ్లూరు సీఐని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌, పోలీసు ఉన్నతాధికారులు రావాలని, ఎంపీ సురేశ్‌ సహా 29 మంది పేర్లతో కూడిన ఎఫ్‌ఐఆర్‌ కాపీని తమకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనికి పోలీసులు స్పందించకపోవడంతో సీఎం నివాసానికి వెళ్లేందుకు ఉద్యుక్తులయ్యారు. పోలీసులు అడ్డుకోవడంతో మళ్లీ రోడ్డుపైకి చేరి రాత్రి 10.30 గంటల వరకూ ఆందోళన కొనసాగించారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్‌కుమార్‌ వెలగపూడిలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మరియమ్మ మృతదేహాన్ని గుంటూరు పార్లమెంట్‌ తెదేపా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ సందర్శించారు. ఆందోళనకారులు, పోలీసులు, నేతల రాకపోకలతో గ్రామంలో ట్రాఫిక్‌ స్తంభించింది.

వీఆర్‌కు తుళ్లూరు సీఐ

ఘర్షణలను నియంత్రించడంలో పోలీసుల తీరుపై విమర్శలు వచ్చాయి. ఆ రాష్ట్ర హోంమంత్రి సుచరిత సమక్షంలోనే తుళ్లూరు సీఐ ధర్మేంద్రబాబుపై బాధితులు తీవ్ర ఆరోపణలు చేశారు. సీఐను వీఆర్‌కు పంపినట్లు గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ ధ్రువీకరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.