కరోనా నివారణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంటే.. కొందరు మాత్రం నిర్లక్ష్యం వహిస్తూ వైరస్‌ను తేలికగా తీసుకుంటున్నారు. అంబులెన్స్‌లో ఉపయోగించే పీపీఈ కిట్లు తొలగించిన అనంతరం ఎక్కడపడితే అక్కడ పడేస్తున్న ఘటనలు హైదరాబాద్‌లో వెలుగు చూస్తున్నాయి. తాజాగా మలక్‌పేట టీవీ టవర్ వద్ద ఓ 108 అంబులెన్స్ డ్రైవర్ పీపీఈ కిట్లు, ఫేస్ షీల్డులను అందరూ చూస్తుండగానే పడేసి వెళ్లాడు.
ఈ దృశ్యాలు ఈటీవీకి చిక్కడంతో అప్రమత్తమైన సిబ్బంది.. తప్పించుకోవాలని చూశారు. అదే సమయంలో అటుగా వెళ్తోన్న మలక్‌పేట ఎస్సై దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి వాటిని అక్కడే కాల్చేయించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడపడితే అక్కడ పడేయొద్దని సిబ్బందిని హెచ్చరించారు.
ఇలా జంట నగరాల్లో బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్ల ప్రజలు భయాందోళకు గురవుతున్నారు.