ETV Bharat / state

Disha accused Encounter case: ఈనెల 21న దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసు విచారణ

author img

By

Published : Aug 18, 2021, 10:28 PM IST

దిశ నిందితుల ఎన్​కౌంటర్ ఘటనలో (Disha accused Encounter case) త్రిసభ్య కమిషన్ విచారణ కొనసాగనుంది. కొవిడ్ కారణంగా ఆలస్యమైన విచారణ వీలైనంత త్వరలో పూర్తి చేసేందుకు కమిషన్ చర్యలు చేపట్టింది. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టనుంది. ఈ నెల 21న ఆధారాలతో సహా విచారణకు హాజరవ్వాలని ప్రభుత్వాన్ని కమిషన్ ఆదేశించింది. 26,27,28 తేదీల్లో 18మంది సాక్ష్యులను కమిషన్ విచారించనుంది.

Disha
disha

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో (Disha accused Encounter case) ఏర్పాటైన కమిషన్.. విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రజల నుంచి 1,330, ప్రభుత్వం, పోలీసులు, వైద్యుల నుంచి 103 అపిఢవిట్లను స్వీకరించిన కమిషన్ ఇప్పటికే వాటిని విశ్లేషించింది. ఎన్​కౌంటర్​లో పాల్గొన్న పోలీసులు సమర్పించిన 24 అఫిడవిట్లకు సంబంధించి... కమిషన్ సభ్యులు 16 సార్లు వీడియో కాన్ఫరెన్సులో విచారించారు. ఇందులో వాళ్లను పలు ప్రశ్నలు కూడా సంధించారు. కేసు విచారణలో భాగంగా ఈ నెల 21న ప్రభుత్వాన్ని విచారణకు హాజరవ్వాల్సిందిగా కమిషన్ ఆదేశించింది. తగిన ఆధారాలతో సహా హైకోర్టు ప్రాంగణంలోని కమిషన్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 26,27,28 తేదీల్లో సాక్ష్యులను విచారించనుంది. కమిషన్ కార్యదర్శి నుంచి అనుమతి పొందిన వాళ్లు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే విచారణను చూసే అవకాశం కల్పించారు. దీనికోసం కమిషన్ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.

కొవిడ్​ కారణంగా వాయిదా పడుతూ..

2019 డిసెంబర్ 6న దిశ నిందితుల ఎన్​కౌంటర్ జరిగింది. ఈ ఎన్​కౌంటర్​ను సవాల్ చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో త్రిసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తూ డిసెంబర్ 12న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిర్పూర్కర్ ఛైర్మన్​గా, బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రేఖ బల్డోటా, సీబీఐ మాజీ సంచాలకులు కార్తికేయ సభ్యులుగా ఉన్నారు. గతేడాది ఫిబ్రవరిలో తొలిసారిగా హైదరాబాద్ వచ్చిన త్రిసభ్య కమిషన్... ఎన్​కౌంటర్​కు సంబంధించి పలు రికార్డులు స్వీకరించింది. కరోనా కారణంగా విచారణ వాయిదా పడుతూ వచ్చింది. 6నెలల గడువు ముగియడంతో... మరలా పొడిగించాలని కోరడంతో అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. అయినా సకాలంలో విచారణ సాగకపోవడం వల్ల గత నెలలో కమిషన్ మరోసారి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మరో ఆర్నెళ్లు పొడిగించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో త్రిసభ్య కమిషన్ విచారణ వేగవంతం చేసింది.

ఇదీ ఘటన

2019 నవంబర్ 27న రాత్రి... తొండుపల్లి జంక్షన్ వద్ద ఉన్న వైద్యురాలు దిశను నలుగురు నిందితులు అత్యాచారం చేసి... ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించి తగులబెట్టారు. తొండుపల్లి టోల్​గేట్ సమీపంలోని ప్రధాన రహదారి పక్కనే దిశను... ఆరిఫ్, చెన్నకేశవులు, నవీన్, శివ సామూహిక అత్యాచారం చేశారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను... లారీలో తీసుకెళ్లి షాద్​నగర్ సమీపంలో జాతీయ రహదారి వంతెన కింద పెట్రోల్ పోసి తగులబెట్టారు. 28వ తేదీ తెల్లవారుజామున పశువులకాపరి... కాలుతున్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి ఆరీఫ్, చెన్నకేశవులు, శివ, నవీన్​ను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. ఆ తర్వాత న్యాయస్థానం ఆదేశాల మేరకు కస్టడీలోకి తీసుకున్నారు. 2019 డిసెంబర్ 6న తెల్లవారుజామున నలుగురు నిందితులను సైబరాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి తీసుకెళ్లారు. సీన్​రీ కన్​స్ట్రక్షన్ చేస్తున్న క్రమంలో నలుగురు నిందితులు పోలీసుల వద్ద ఉన్న తుపాకులు లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్లు రువ్వడంతో పాటు కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు నిందితులు మృతి చెందారు.

దిశ హత్యాచారం ఎంత సంచలనం కలిగించిందో.... నిందితుల ఎన్​కౌంటర్ అదే స్థాయిలో చర్చనీయాంశమైంది. పలు మానవ హక్కుల సంఘాలతో పాటు... మృతుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు త్రిసభ్య కమిషన్​ను ఏర్పాటు చేసింది.

కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ విచారణను చూసే అవకాశం

కొవిడ్ కారణంగా వీడియో కాన్ఫరెన్సు నిర్వహిస్తున్న కమిషన్.... కొంతమంది సాక్ష్యులను నేరుగా కూడా విచారించనుంది. ఈ నెల 21న నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ విచారణకు ప్రభుత్వం తరఫు న్యాయవాదితో పాటు 26,27,28 తేదీల్లో సాక్ష్యులు హైకోర్టు ప్రాంగణంలో కమిషన్ కార్యాలయానికి రావాల్సి ఉంది. కమిషన్ కార్యదర్శి నుంచి అనుమతి పొందిన ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ విచారణను చూసే అవకాశం కల్పించారు.

ఇదీ చూడండి: ఎన్​కౌంటర్​ గురించి అనుమానాలున్నాయా...?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.