ETV Bharat / state

డిస్కౌంట్ షురూ.. తొలి 8 గంటల్లో 1.77 లక్షల చలానాల చెల్లింపు - Discount on Traffic Pending Challans in Hyderabad

Discount on Traffic Pending Challans : పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్‌ చలాన్లను రాయితీపై ఇవాళ్టి నుంచి క్లియర్ చేసుకోవచ్చు. మంగళవారం నుంచి మార్చి 31 వరకు పెండింగ్‌ చలానాలు చెల్లించవచ్చు. ఈ మేరకు అధికారులు ఇదివరకే ప్రకటించారు. తొలి 8 గంటల్లో లక్షా 77వేల చలానాలను వాహనదారులు చెల్లించారు.

Telangana Traffic Pending Challans pay, pending challan discount
ట్రాఫిక్‌ చలాన్ రాయితీలు నేటి నుంచే అమలు..
author img

By

Published : Mar 1, 2022, 7:15 AM IST

Updated : Mar 1, 2022, 10:36 AM IST

Discount on Traffic Pending Challans : హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ చలానాల రాయితీలు అమల్లోకి వచ్చాయి. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 75 శాతం, కార్లు, లారీలకు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 70శాతం, తోపుడు బండ్లకు 80 శాతం రాయితీతో పెండింగ్ చలాన్లను చెల్లించే అవకాశాన్ని పోలీసులు కల్పించారు. కొవిడ్ నిబంధనల్లో మాస్క్ ధరించని వారికి విధించిన జరిమానాల్లో 90 శాతం రాయితీ కల్పించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 1.7 కోట్లు చలాన్లతో రూ.600 కోట్ల జరిమానా పెండింగ్ ఉన్నట్లు గణంకాలు వెల్లడిస్తున్నాయి. చలన్లా చెల్లింపు అర్ధరాత్రి నుంచి అమల్లోకి రావటంతో తొలి 8 గంటల్లో లక్షా 77వేల చలానాలను వాహనదారులు చెల్లించారు. వీటి ద్వారా రూ.కోటి 77లక్షల రూపాయలు జమయ్యాయి.

పెండిగ్ చలాన్ల క్లియరింగ్ కోసం..

రాష్ట్రవ్యాప్తంగా 1750 కోట్ల రూపాయల చలాన్లు పెండింగ్ ఉన్నాయి. ట్రాఫిక్ పోలీసుల వెబ్ సైట్ తో పాటు మీ సేవలో చలాన్లు చెల్లించే అవకాశాన్ని పోలీసులు కల్పించారు. సాంకేతిక సమస్య తలెత్తకుండా సర్వర్లను సామర్థ్యం పెంచిన ట్రాఫిక్ పోలీసులు... యూపీఐ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. వాహనదారుల సౌలభ్యం కోసం ఈ నెల 31వరకు రాయితీపై చెల్లించే అవకాశాన్ని ట్రాఫిక్ పోలీసులు కల్పించారు. రహదారి నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి విధించిన చలానాలను రాయితీ ద్వారా చెల్లించేందుకు పోలీసుశాఖ ఇచ్చిన అవకాశం మంగళవారం నుంచి అమలులోకి రానుంది. మార్చి 31 వరకూ ఇది అమలులో ఉంటుంది. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన నేరంపై పోలీసులు జరిమానాలు విధించినా చాలామంది వాటిని చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఈ బకాయిలు దాదాపు రూ.2300 కోట్లకు చేరాయి. దాంతో ఈ మొత్తాన్ని వసూలు చేసేందుకు పోలీసుశాఖ భారీగా రాయితీలు ప్రకటించింది.

ఇవాళ్టి నుంచే..

Traffic Challans Discount: రాష్ట్రంలో వాహన చలానాల మొత్తం కొండలా పేరుకుపోయింది. ట్రాఫిక్‌ జరిమానాల మొత్తం 1250 కోట్ల రూపాయలు ఉన్నాయి. దాదాపు 90 శాతం మంది వాహనదారులకు జరిమానా భారంగా మారినట్లు పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. కొండలా పేరుకు పోయిన వాహన చలానా మొత్తాన్ని రాబట్టేందుకు రాయితీ స్కీము తీసుకురావాలని భావించిన పోలీసు శాఖ.. ఇవాళ్టి నుంచి మార్చి 31 వరకు ఈ రాయితీలను అమలు చేస్తుంది.

ఎలా కట్టాలి?

pending Challans : వాహనదారులు తమ చలానాలను ట్రాఫిక్‌ ఈ-చలానా వెబ్‌సైట్‌, ట్రాఫిక్ పోలీస్‌ వెబ్‌సైట్‌ ద్వారా లేదా.. నేరుగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చెల్లించవచ్చు. వాహనదారులు తమ పెండింగ్ చలానాలను చెల్లించేందుకు వీలుగా అధికారులు సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తున్నారు. మార్చి 1 నుంచి వెబ్‌సైట్లలో లోక్‌అదాలత్ ఐచ్ఛికాంశం చేరుతుంది. ఈ ఆప్షన్‌ను ఎంచుకోగానే.. రాయితీ పోనూ కట్టాల్సి సొమ్ము చూపిస్తుందని అధికారులు చెబుతున్నారు.

అధికారుల ప్రత్యేక ఏర్పాట్లు

Discount on Traffic Challans in Telangana : రాయితీ అమలు అయ్యే ఈరోజు.. వాహనదారులు పెద్ద సంఖ్యలో వెబ్‌సైట్‌లకు వెళ్లే అవకాశాలుండటంతో.. అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సర్వర్‌ సమస్యలు రాకుండా సాఫ్ట్‌వేర్‌ సామర్థ్యాన్ని పెంచనున్నారు. నెల రోజుల సమయం ఉంది కాబట్టి.. సమయానుకూలంగా జరిమానా చెల్లించాలని పోలీసులు సూచిస్తున్నారు. హైదరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మంగళవారం నుంచి రాయితీలు వర్తింపజేస్తారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ట్రాఫిక్ చలానాలకు రాయితీ వర్తించడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశముంది. ట్రాఫిక్‌ చలానాలు రాయితీపై ట్రాఫిక్‌ పోలీసులు స్పష్టత ఇచ్చారు. ద్విచక్రవాహనాలకు, ఆటోలకు 75 శాతం మేర రాయితీ కల్పిస్తారు. అంటే 100 రూపాయలు చలానా మొత్తం ఉంటే.. అందులో 25 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. కార్లు, ఇతర భారీ వాహనాలకు 50 శాతం రాయితీ చెల్లిస్తే సరిపోతుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మార్చి 1 నుంచి 31 వరకు ఈ రాయితీ అమల్లో ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీ వాహనంపై ఉన్న పెండింగ్ చలాన్లు క్లియర్ చేసేయండి.

Last Updated : Mar 1, 2022, 10:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.