Shekar Kammula at Fire department week celebrations: ప్రాణాలను ఎదురొడ్డి ప్రజల ప్రాణాలను రక్షించడంలో అగ్నిమాపక శాఖ కీలక పాత్ర పోషిస్తుందని ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ అగ్నిమాపక కార్యాలయంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శేఖర్ కమ్ముల హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అగ్నిమాపక ప్రాంతీయ అధికారి పాపయ్యతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అగ్నిమాపక వారోత్సవాలు ఎంతగానో ఉపయోగపడతాయని శేఖర్ కమ్ముల అన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని తెలిపారు. కార్యక్రమంలో అగ్నిమాపక రీజినల్ అధికారి పాపయ్య, మధుసూదన్, స్టేషన్ ఇన్‌ఛార్జి మోహన్ రావు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో వాడే వస్తువుల గురించి శేఖర్ కమ్ములకు అధికారులు వివరించారు.
"అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు అగ్నిమాపక శాఖ అధికారుల పాత్ర చాలా కీలకం. వారి సేవలు ఎంతో విలువైనవి. ప్రతి ఒక్కరికీ అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరం. రహదారిపై వెళ్తునప్పుడు అంబులెన్స్‌కు దారి ఇచ్చిన మాదిరిగానే అగ్నిమాపక వాహనాలకు సైతం దారి ఇవ్వాలి. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ వారోత్సవాలు ఎంతగానో దోహదపడతాయి." -శేఖర్ కమ్ముల, దర్శకుడు
ఇదీ చదవండి: 'నేను మంత్రిగా ఉన్నానంటే అది ఆ మహనీయుని చలువే'
'ట్విట్టర్ మొత్తాన్ని కొనేస్తా'.. మస్క్ ఆఫర్.. అగర్వాల్ ఏం చేసేనో?