ETV Bharat / state

'తీవ్రంగా రెండోదశ... యువతలో వ్యాప్తి అధికం' - వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు

రెండోదశ కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉందని, వైరస్‌ ప్రజల్లోకి వ్యాపించిందని వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గత ఏడాది తొలి కరోనా కేసు మొదలయ్యాక అత్యధికంగా శుక్రవారం 5 వేలకు చేరువగా కేసులు వచ్చాయన్నారు. వచ్చే ఆరువారాల్లో కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని, యువతలో వైరస్‌ వ్యాప్తి ఎక్కువైందని చెప్పారు. రెండోదశలో కేసులు ఎక్కువగా వస్తున్నాయని, పరీక్ష ఫలితాలు వచ్చేలోగానే బాధితుడి కుటుంబసభ్యులు మహమ్మారి బారిన పడుతున్నారని పేర్కొన్నారు.

director-of-public-health-srinivas-rao-on-corona-virus-in-state
'తీవ్రంగా రెండోదశ... యువతలో వ్యాప్తి అధికం'
author img

By

Published : Apr 18, 2021, 7:01 AM IST

రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌, రాత్రి, వారాంతపు కర్ఫ్యూలు అవసరం లేదని వైద్యారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. లాక్‌డౌన్‌ విధిస్తే కరోనాతో చనిపోయేవారి కన్నా ఆకలిచావులు ఎక్కువగా ఉంటాయని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌, వెంటిలేటర్లు, సిబ్బందికి కొరత లేదన్నారు. పారిశ్రామిక ఆక్సిజన్‌ను పూర్తిస్థాయిలో వైద్య అవసరాలకు వినియోగిస్తున్నామన్నారు. కరోనా తీవ్రత పెరిగినా తట్టుకునే శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో రోజుకు 1.25 లక్షల పరీక్షలు చేస్తున్నామని, దేశంలో పాజిటివ్‌ రేటు 5.48 శాతంగా ఉంటే, రాష్ట్రంలో 2.98గా ఉందన్నారు. రానున్న రోజుల్లో పరీక్షల సంఖ్యను పెంచుతామని శ్రీనివాసరావు తెలిపారు.

ప్రభుత్వ కేంద్రాల్లో నేడు టీకాల్లేవు

రాష్ట్రంలో వ్యాక్సిన్‌ నిల్వలు శనివారానికి అయిపోయాయి. ఆదివారం ప్రభుత్వ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఉండదు. ఆదివారం రాత్రికి 2.7 లక్షల డోసులు కేంద్రం నుంచి రానున్నాయి. సోమవారం నుంచి షెడ్యూలు ప్రకారం యథావిధిగా టీకాలు కొనసాగుతాయి.

రెండురోజుల్లో ప్రైవేటులో 53,556 పడకలు...

‘‘రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో పడకల కొరత లేదు. గత ఏడాది సెప్టెంబరు నాటికి 18,232 పడకలు ఉంటే.. ప్రస్తుతం 38,752కి పెంచాం. రానున్న రెండు రోజుల్లో ప్రైవేటు ఆసుపత్రుల పడకల సామర్థ్యం 53,556కు పెరగనుంది. రాష్ట్రంలో 116 ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు ఉన్నాయి. నగరంలో 5 ప్రభుత్వ ఆసుపత్రులను కరోనా ఆసుపత్రులుగా గుర్తించాం. 1235 ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు అనుమతించాం. ‘గాంధీ’లో ప్రస్తుతం 700 ఆక్సిజన్‌ బెడ్లు ఉన్నాయి. కరోనా వచ్చిన వారిలో 80 శాతం మందికి లక్షణాలు ఉండటం లేదు. లక్షణాల్లేని వారు, స్వల్ప లక్షణాలున్న వ్యక్తులు ఆసుపత్రులకు రావాల్సిన అవసరం లేకుండా వైద్యుల్ని సంప్రదించి ఇంట్లోనే చికిత్స పొందాలి. మధ్యస్థ, తీవ్ర లక్షణాలున్న వారు ఆసుపత్రుల్లో చేరాలి. స్వల్ప లక్షణాలున్న వ్యక్తులు ఆసుపత్రుల్లో చేరితే, తీవ్ర లక్షణాలున్న బాధితులు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కొందరు ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ బెడ్లు లేవన్న ఆందోళనలతో ప్రాణాలు కోల్పోతున్నారు.

ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ తిరిగే బదులుగా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి ప్రాణాలు కాపాడుకోవాలి. జూన్‌ వరకు ప్రభుత్వం చెప్పిన జాగ్రత్తలు ప్రజలు పాటించాలి. వీలైతే పండగలు, వివాహాలు వాయిదా వేసుకోవాలి. తప్పనిసరైతే తక్కువ మంది సమక్షంలో ముగించాలి. ఆరువారాల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు. కరోనా వైరస్‌లో ప్రపంచ వ్యాప్తంగా 2.5 లక్షల మ్యుటేషన్స్‌ ఉన్నాయి. అమెరికా, ఇంగ్లండ్‌, బ్రెజిల్‌ దేశాలపై కొవిడ్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి. వందేళ్ల క్రితం స్పానిష్‌ ఫ్లూ వచ్చినపుడు తొలిదశలో 30-50 లక్షల మంది చనిపోయారు. అంతా సర్దుకుందన్న అపోహతో రెండోదశలో 2-7 కోట్ల మంది చనిపోయారు. ఇప్పుడు ప్రజలు నిర్లక్ష్యం చేస్తే కరోనాతో ముప్పు ఉంది.
వ్యాక్సిన్ల కోసం కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. తొలిదశ వ్యాక్సిన్‌ డోసు తీసుకున్నవారికి రెండోదశ డోసు ఇచ్చిన తరువాత మిగతా వారికి వ్యాక్సిన్లు అందిస్తాం. ఇప్పటికే 28 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చాం. 25 లక్షల మందికి మొదటిడోసు పూర్తయింది. రోజుకు 1.5 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేసినా జూన్‌ నాటికి లక్ష్యం నెరవేరుతుంది. ఇప్పటికే వ్యాక్సిన్‌ 25 శాతం పూర్తయింది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలను నమ్మకుండా ఏదైనా సమాచారం కోసం 104కి ఫోన్‌ చేయాలి.

రెమ్‌డెసివిర్‌ అనవసరంగా వాడొద్దు

రెమ్‌డెసివిర్‌ కరోనా నివారణకు ముఖ్యమైన ముందు కాదు. అది ఇప్పటికీ పరీక్షల దశలో ఉంది. తీవ్రమైన లక్షణాలున్న వారికి వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. స్వల్ప లక్షణాలున్న వ్యక్తులు సొంతంగా వాడొద్దని, ప్రైవేటు వైద్యులు అనవసరంగా వినియోగించొద్దని సూచించాం’’ అని శ్రీనివాసరావు తెలిపారు. కరోనా వైరస్‌ గాలిలో ఉందని నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా. ఈ విషయాన్ని లాన్సెట్‌ అంతర్జాతీయ పరిశోధన రుజువుచేసింది. ప్రస్తుత పరిస్థితి చేయిదాటిపోతే తట్టుకునే శక్తి దేశానికి లేదు.

ఇదీ చూడండి: జూన్ వరకూ జాగ్రత్తగా ఉండండి.. కరోనా చికిత్సపై ఆందోళన వద్దన్న డీహెచ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.