లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత ప్రజల కదలికలు ఎక్కువయ్యాయని, అందుకే కేసుల సంఖ్య పెరుగుతోందని ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో 12,178 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని, అందులో 9,786 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని చెప్పారు.
బోధనా కళాశాలల్లో కూడా కరోనా రోగులకు చికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. కరోనా లక్షణాలు ఉంటే తప్పక పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. హోం ఐసోలేషన్ సదుపాయం లేనివారికి ప్రభుత్వ ఐసోలేషన్లలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు.
టిమ్స్‌లో కూడా నిన్నటి నుంచి కరోనా రోగులకు చికిత్స జరుగుతోందన్నారు. 98 ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు అనుమతులు ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఇక నుంచి పడకల వివరాలను డ్యాష్ బోర్డులో ప్రదర్శిస్తామని తెలిపారు.
ప్రజల సహాయార్థం 3 రకాల కాల్‌సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. 104 నంబర్‌కు ఫోన్ చేసి అన్ని రకాల సహాయాలు పొందవచ్చని తెలిపారు. రోగులను తరలించడం కోసం 90 అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచామన్నారు. కరోనా బాధితుల్లో ఒకశాతం మంది మాత్రమే చనిపోయారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:పసిడి పరుగు భవిష్యత్‌లోనూ కొనసాగేనా?