కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్) నెలకొల్పారు. ఈ సంస్థ దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో వివిధ స్థాయుల్లో కోర్సులను అందిస్తోంది. తాజాగా సిపెట్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ టెక్నాలజీ (ఐపీటీ) -కొచ్చి ఇంటర్ విద్యార్థుల కోసం డిప్లొమా కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది.
కోర్సులు
*డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ
* డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ
అర్హత:
ఇంటర్ ఎంపీసీ/బైపీసీ లేదా నిర్దేశిత బ్రాంచీల్లో రెండేళ్ల ఐటీఐ ఉత్తీర్ణత. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఇంటర్/ఐటీఐ మార్కుల మెరిట్ ప్రకారం సీట్లు కేటాయిస్తారు.
కోర్సు స్వరూపం:
లేటరల్ ఎంట్రీ డిప్లొమా కోర్సుల వ్యవధి రెండేళ్లు. ఇందులో చేరినవారు మూడేళ్ల డిప్లొమాలో రెండో ఏడాది కోర్సులోకి నేరుగా చేరిపోవచ్చు. తొలి మూడు సెమిస్టర్లకు కొచ్చి క్యాంపస్‌లో తరగతులు ఉంటాయి. చివరి సెమిస్టర్ సంబంధిత పరిశ్రమలో ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఆగస్టు నుంచి తరగతులు మొదలవుతాయి.
ఉద్యోగాలు
రెండేళ్ల ఈ కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి ఆటోమోటివ్, ప్యాకేజింగ్, కన్స్యూమర్ గూడ్స్, మెషిన్ మాన్యుఫ్యాక్చరింగ్, ఎల‌్రక్టికల్ అండ్ ఎల‌్రక్టానిక్స్, ఆర్ అండ్ డీ, ఇంజినీరింగ్ తదితర విభాగాలకు చెందిన సంస్థల్లో అవకాశాలు ఉంటాయి. మిల్టన్, సెలో, ఎల్ అండ్ టీ, మారుతీ సుజుకీ, ఓఎన్‌జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆదానీ, గోద్రెజ్, అరవింద్ మొదలైన సంస్థలు క్యాంపస్ నియామకాల ద్వారా వీరిని ఎంపిక చేసుకుంటున్నాయి.
ఉన్నత విద్య:
డిప్లొమా అనంతరం ఉన్నత చదువులకూ వీలుంది. సిపెట్ అందించే బీటెక్ ప్లాస్టిక్ ఇంజినీరింగ్ లేదా బీటెక్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజినీరింగ్‌లో లేటరల్ ఎంట్రీ విధానంలో చేరి మూడేళ్లకే కోర్సు పూర్తిచేసుకోవచ్చు.