ETV Bharat / state

టీవీలు లేని వారు 1.70 లక్షల మందికి పైనే

ప్రతి విద్యార్థికి డిజిటల్‌ పాఠాలు చేరాలని పాఠశాల విద్యాశాఖ లక్ష్యం పెట్టుకున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తుంటే అంత సులభంగా అది నెరవేరేలా కనిపించడం లేదు. విద్యార్థుల ఇళ్లలో టీవీలు లేకపోవడం.. డిష్‌ కనెక్షన్లు ఉన్నా.. వాటిల్లో టీశాట్‌ ఛానెళ్ల ప్రసారాలు రాకపోవడం వంటివి ఎదురుకానున్నాయి. ప్రణాళిక రూపొందించినా అమలులో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులూ అంతర్గతంగా అంగీకరిస్తున్నారు.

టీవీలు లేని వారు 1.70 లక్షల మందికి పైనే
టీవీలు లేని వారు 1.70 లక్షల మందికి పైనే
author img

By

Published : Aug 28, 2020, 6:26 AM IST

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారిలో 1.70 లక్షల మందికి పైగా విద్యార్థుల ఇళ్లల్లో టీవీలు లేవని పాఠశాల విద్యాశాఖ ప్రాథమిక సర్వేలో తేలింది. ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్లాకే పక్కా సమాచారం అందుతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25,500 పాఠశాలల్లో 22 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. డిజిటల్‌ తరగతులను 3-10 తరగతులకు నిర్వహిస్తున్నారు. వారు 18లక్షల మంది ఉన్నారు. వారిలో 1.70 లక్షల మందికి పైగా టీవీ లేదని సమాచారం. అందుకే విద్యాశాఖ మార్గదర్శకాల్లో టీవీలు లేని వారికి గ్రామ పంచాయతీ కార్యాలయం లేదా ఇతర ప్రభుత్వ కార్యాలయంలో టీవీ సౌకర్యం కల్పించాలని, లేకుంటే ఆ విద్యార్థుల సమీపంలోని ఇళ్లలో ఇతర పిల్లలకు కలిసి పాఠాలు వినాలని సూచించింది. పంచాయతీ కార్యాలయాల్లో అన్నిచోట్ల టీవీలు లేవని చెబుతున్నారు.

కరోనా నేపథ్యంలో టీవీలు లేనివారిని బడుల్లోకి రానివ్వొద్దని పాఠశాల విద్యాశాఖ అంతర్గతంగా డీఈఓలను ఆదేశించింది. ఒకరిద్దని రానిస్తే మిగతా వారినీ పంపే అవకాశం ఉందని, అప్పుడు కరోనా ప్రబలితే సమస్య అవుతుందని హెచ్చరించినట్లు సమాచారం. మరోవైపు రాష్ట్రంలో కన్నడ, తమిళం, మరాఠీ, ఉర్దూ మాధ్యమ పాఠశాలలున్నాయి. వాటిల్లో దాదాపు లక్ష మంది వరకు విద్యార్థులున్నారు. వారికి ఇప్పుడు టీవీ పాఠాలుండవు.

ఆ కనెక్షన్లు ఉంటే కష్టం

కేబుల్‌ ఆపరేటర్లు చాలాచోట్ల టీశాట్‌ ఛానెళ్లను ఇవ్వడం లేదని సమాచారం. ప్రభుత్వం ఆదేశిస్తే వారు ప్రసారాలు ఇస్తారు. ప్రస్తుతం పల్లెల్లోనూ చాలామంది ప్రైవేటు డిష్‌ కనెక్షన్లు తీసుకున్నారు. ఇటీవలే టీశాట్‌ అధికారులు ఎయిర్‌టెల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నందున వాటిలో ప్రసారాలు వస్తాయి.

వర్క్‌షీట్లు ఇవ్వాలంటే రూ.40 కోట్లు

వర్క్‌షీట్లను ముద్రించి ఇవ్వాలని గతంలో పాఠశాల విద్యాశాఖ అనుకున్నా తాజాగా వాటిని స్వయంగా ఇవ్వరాదని నిర్ణయించింది. టీవీ, స్మార్ట్‌ఫోన్‌ లాంటివి లేనివారికే ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు డీఈఓలకు స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది. విద్యార్థులందరికీ ముద్రించి ఇస్తే నెలకు రూ.40 కోట్లు ఖర్చవుతుందని అంచనా. 3-5 తరగతులకు మొత్తం 1500 వర్క్‌షీట్లున్నాయి. అవి నెల రోజులకు మాత్రమే.

తరగతుల తీరు...

  • తరగతులు: 3-10
  • ప్రతిరోజూ ప్రసారం: 7.30 గంటలు (దూరదర్శన్‌: 2.30 గంటలు, టీశాట్‌ ఛానెళ్లు విద్య, నిపుణ: 5 గంటలు)
  • ప్రసారాల సమయం: దూరదర్శన్‌: ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, టీశాట్‌: ఉదయం 10-12 గంటలు, మధ్యాహ్నం 2-5 గంటలు
  • ఖర్చు: దూరదర్శన్‌కు అరగంటకు దాదాపు రూ.10 వేలు (రోజుకు 2 గంటల చొప్పున)
  • ఒక్కో తరగతికి పాఠాల సమయం: గంట
  • ఒక్కో పాఠం ప్రసారం: 30 నిమిషాలు (రోజుకు 2 పాఠాలు)

ఇదీ చదవండి: 'రామోజీ ఫిల్మ్‌సిటీలో వైభవంగా ఈటీవీ రజతోత్సవం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.