ETV Bharat / state

షెడ్యూలు​ విడుదలైనా.. రిజర్వేషన్లపై లేని స్పష్టత - telangana election commission

మున్సిపల్​ ఎన్నికల నగారా మోగినా ఇంత వరకు రిజర్వేషన్లపై స్పష్టత రాలేదు. తక్షణమే రిజర్వేషన్లు ప్రకటించాలని రాజకీయ పార్టీలు డిమాండ్​ చేస్తున్నాయి. అధికార పార్టీ తెరాస ఇప్పటికే అభ్యర్థులను గుర్తించింది. కాంగ్రెస్‌, భాజపాలు కసరత్తు మొదలు పెట్టాయి. ఏ స్థానం ఎవరికి రిజర్వ్‌ అవుతుందో తెలియక.. అభ్యర్థుల ఎంపికపై పార్టీలు అయోమయంలో ఉన్నాయి.

did not clarity on municipal elections results
షెడ్యూలు​ విడులైనా.. రిజర్వేషన్లపై రాని స్పష్టత
author img

By

Published : Dec 27, 2019, 6:05 AM IST

Updated : Dec 27, 2019, 7:23 AM IST

షెడ్యూలు​ విడులైనా.. రిజర్వేషన్లపై రాని స్పష్టత

తెలంగాణలో 120 పురపాలక సంఘాలు, 10 నగరపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే షెడ్యూలు విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ప్రాథమికంగా పూర్తి చేయాల్సిన రిజర్వేషన్లు, ఓటర్ల జాబితాలు సిద్ధం కాకపోవడం వల్ల రాజకీయ పార్టీలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నాయి. రిజర్వేషన్లు ఖరారు కావడానికి మరో వారం రోజులకుపైగా పట్టే అవకాశాలు ఉండటం వల్ల.. అభ్యర్థుల ఎంపికపై తర్జనభర్జనలు పడుతున్నాయి.

అభ్యర్థుల ఎంపికపై పార్టీల్లో తర్జనభర్జన

నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలతోపాటు వార్డులు ఎవరికి రిజర్వ్‌ అయ్యాయనేది వెల్లడి కాకుండా ముందుకు వెళ్లడం కుదరదు. ఊహించని విధంగా వార్డుల పునర్విభజన, వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్లు ఖరారు కాకుండానే షెడ్యూలు రావడం కాంగ్రెస్‌, భాజపాలకు ఇబ్బందికరంగా మారింది. శాసన సభ ఎన్నికలతోపాటు సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఆధిక్యాన్ని చాటిన అధికార పార్టీ.. పురపాలక ఎన్నికల్లోనూ సత్తా చాటాలని చూస్తోంది. హస్తం, కాషాయం పార్టీలు కూడా ఎక్కువ సీట్లు గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి.

జనవరి 4 లేదా 5 తేదీల్లో ఖరారు..?

రిజర్వేషన్లు జనవరి 4 లేదా 5 తేదీల్లో ఖరారయ్యే అవకాశం ఉంది. రిజర్వేషన్లు వెలువడిన తరువాత నామినేషన్లకు గరిష్ఠంగా మూడు రోజులు మాత్రమే ఉండటంతో అభ్యర్థుల ఎంపిక వ్యవహారంపై పార్టీల్లో తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. అభ్యర్థులు ఎంపికైనా... నామినేషన్లు వేయడానికి రెండు రోజుల్లోనే సిద్ధం కావాల్సి ఉండడం వల్ల ఆశావహులకు ముందుగానే అవసరమైన ధ్రువపత్రాలు సిద్ధం చేసుకుంటున్నారు.

ఎన్నికల యుద్ధానికి సిద్ధమైన పార్టీలు

  • తెరాస ఇప్పటికే క్షేత్రస్థాయిలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసి ఎమ్మెల్యేలకు ఎన్నికల బాధ్యతను అప్పగించింది.
  • వార్డుల్లో ఎవరెవరిని బరిలో దింపాలో ఆ పార్టీకి స్పష్టత ఉంది. రిజర్వేషన్ల అంచనాల్లో మార్పులు ఉంటే.. ఆ మేరకు అభ్యర్థులను మార్పు చేసుకోడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
  • కాంగ్రెస్​లో క్షేత్రస్థాయిలో అభ్యర్థుల ఎంపిక కొంత గందరగోళంగా ఉంది. బరిలో దిగేందుకు ఆశావహులు ఉన్నా.. రిజర్వేషన్లు గుబులు పుట్టిస్తున్నాయి.
  • ప్రధానంగా జనరల్‌, బీసీ స్థానాలపై నేతల్లో సందేహాలు ఉండగా అభ్యర్థుల ఎంపిక బాధ్యతను పూర్తిగా జిల్లా కాంగ్రెస్‌ కమిటీలకు పీసీసీ అప్పగించింది.

"ఈ నెల 30న వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాలు అందుబాటులోకి రానుండగా అదే రోజు వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళ ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురిస్తారు. అభ్యర్థుల ఎంపిక స్పష్టత కోసం 30వ తేదీ వరకైనా ఆగక తప్పదని కాంగ్రెస్‌, భాజపా నేతలు పేర్కొంటున్నారు"

ఇవీ చూడండి: 'ఒక్క ఎన్నికల్లో కూడా గెలవనివారు నా గురించి మాట్లాడుతున్నారు'

TG_HYD_05_27_POLITICAL_PARTIES_ON_MUNCIPAL_ELECTIONS_PKG_3038066 Reporter: ఎం.తిరుపాల్‌ రెడ్డి ()మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూలు విడుదలైనా...రిజర్వేషన్లపై స్పష్టత లేకపోవడంతో రాజకీయ పార్టీల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఇప్పటికే అభ్యర్ధులను గుర్తించిన తెరాస, కసరత్తు చేస్తున్న కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ఏలా ముందుకెళ్లాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాయి. ఏ స్థానం ఎవరికి రిజర్వ్‌ అవుతుందో తెలియక....అభ్యర్ధుల ఎంపికపై స్పష్టత ఇవ్వలేని పరిస్థితులు రాజకీయ పార్టీలల్లో నెలకొన్నాయి. LOOK వాయిస్ఓవర్‌1: తెలంగాణ రాష్ట్రంలో 120 పురపాలక సంఘాలకు, 10 నగరపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే షెడ్యూలు విడుదల చేసింది. అయితే ఇందుకు సంబంధించి ప్రాధమికంగా పూర్తి చేయాల్సిన రిజర్వేషన్లు, ఓటర్ల జాబితాలు సిద్దం కాలేదు. దీంతో రాజకీయ పార్టీలు తీవ్ర గందర గోళానికి గురవుతున్నాయి. రిజర్వేషన్లు ఖరారు కావడానికి మరో వారం రోజులకుపైగా పట్టే అవకాశాలు ఉండడంతో అభ్యర్ధుల ఎంపికపై పార్టీలు తర్జనభర్జనలు పడుతున్నాయి. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలతోపాటు వార్డులు ఎవరికి రిజర్వ్‌ అయ్యాయనేది వెల్లడి కాకుండా ముందుకు వెళ్లడం కుదరుదు. ఊహించని విధంగా వార్డుల పునర్విభజన, వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్లు ఖరారు కాకుండానే షెడ్యూలు రావడం కాంగ్రెస్‌, బీజేపీలకు ఇబ్బందికరంగా మారింది. శాసన సభ ఎన్నికలతోపాటు సర్పంచి, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఆధిక్యాన్ని చాటిన తెరాస పురపాలక ఎన్నికల్లోనూ అధిక స్థానాలు దక్కించుకుంటామన్న ధీమాతో ఉంది. లోకసభ ఎన్నికల్లో భాజపా నాలుగు...కాంగ్రెస్‌ మూడు స్థానాల్లో గెలుపొందడంతో పురపాలక ఎన్నికలపైనా ఈ రెండు పార్టీలు ఆశలు పెంచుకున్నాయి. వాయిస్ఓవర్‌2: పురపాలక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జనవరి 8వ తేదీ నుంచి మొదలై మూడు రోజులు కొనసాగనుంది. ఎన్నికల సంఘం, పురపాలక శాఖ ఇచ్చిన షెడ్యూలు ప్రకారం వార్డులు, పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల రిజర్వేషన్లు జనవరి 4 లేదా 5 తేదీల్లో ఖరారయ్యే అవకాశం ఉంది. రిజర్వేషన్లు వెలువడిన తరువాత నామినేషన్లకు గరిష్ఠంగా మూడు రోజులు మాత్రమే ఉండడంతో అభ్యర్ధుల ఎంపిక వ్యవహారంపై పార్టీల్లో తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. అభ్యర్ధుల ఎంపికైనా....నామినేషన్లు వేయడానికి రెండు రోజుల్లోనే సిద్దం కావాల్సి ఉండడంతో ఆశావహులకు ముందుగానే అవసరమైన ధ్రువ పత్రాలు సిద్దం చేసి ఉంచుకునే పనిని పార్టీ వర్గాలు ప్రారంభించాయి. వాయిస్ఓవర్‌3: అధికార తెరాస పార్టీ ఇప్పటికే క్షేత్ర స్థాయిలో అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసి ఎమ్మెల్యేలకు ఎన్నికల బాధ్యతను అప్పగించింది. వార్డుల్లో ఎవరెవరిని బరిలో దింపాలో ఆ పార్టీకి స్పష్టత ఉంది. రిజర్వేషన్ల అంచనాల్లో మార్పులు ఉంటే..ఆ మేరకు అభ్యర్ధులను మార్పు చేసుకోడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌ పార్టీలో క్షేత్ర స్థాయిలో అభ్యర్ధుల ఎంపిక అంశం కొంత గందరగోళం నెలకొంది. బరిలో దిగేందుకు ఆశావహులు ఉన్నా రిజర్వేషన్లు గుబులు పుట్టిస్తున్నాయి. ప్రధానంగా జనరల్‌, బీసీ స్థానాలపై నేతల్లో సందేహాలు ఉండగా అభ్యర్థుల ఎంపిక బాధ్యతను పూర్తిగా జిల్లా కాంగ్రెస్‌ కమిటీలకు పీసీసీ అప్పగించింది. ఓటర్ల జాబితాలు కూడా అందుబాటులో లేకపోవడంతో ఎన్నికల్లో ముందుకు ఏలా వెళ్లాలో తెలియక తీవ్ర గందరగోళం ఏర్పడింది. గతంలో ప్రచురించిన ఓటర్ల జాబితాలను పరిగణనలోకి తీసుకుని కొంత కసరత్తు చేస్తున్నా స్పష్టత మాత్రం ఉండటం లేదని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నారు. ఈ నెల 30వ వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాలు అందుబాటులోకి రానుండగా అదే రోజు వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళ ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురిస్తారు. అభ్యర్ధుల ఎంపిక స్పష్టత కోసం 30వ తేదీ వరకైనా ఆగక తప్పదని కాంగ్రెస్‌, బీజేపీ నేతలు పేర్కొంటున్నారు.
Last Updated : Dec 27, 2019, 7:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.