దళిత పారిశ్రామిక వేత్తల సంఘం(డిక్కీ) ప్రతినిధులు ఇవాళ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో భేటీ అయ్యారు. దేశంలో తొలిసారిగా ఎస్సీ, ఎస్సీ కాంట్రాక్టర్లకు పబ్లిక్ వర్క్‌లో 21 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 59 తీసుకురావడంపై డిక్కీ బృందం సభ్యులు కమిషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. యువ కాంట్రాక్టర్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జీవో 59 తీసుకురావడంతో పాటు దాని అమలు కోసం కృషి చేసిన కమిషన్‌కు వారు ధన్యవాదాలు తెలిపారు.
జీవో అమలు కోసం కమిషన్ సింగరేణి యాజమాన్యంతో సమీక్ష నిర్వహించి.. సింగరేణి కాంట్రాక్టు పనుల్లో ఎస్సీ, ఎస్టీ యువ కాంట్రాక్టర్లకు 21 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. దీంతో సింగరేణి యాజమాన్యం ఆమోదం తెలిపింది. ఈ అవకాశాన్ని ఎస్సీ, ఎస్టీ వర్గాల యువ కాంట్రాక్టర్లు వినియోగించుకోవాలని కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సూచించారు.
ఇదీ చదవండి: నూతన సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన వేముల