సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పనోరమా టీచర్స్ కాలనీ సమీపంలో ఉన్న డంపింగ్ యార్డు వల్ల అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డును వెంటనే ఎత్తివేయాలని కాలనీ వాసులు ర్యాలీ జరిపి... స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. మరమ్మతులు చేయిస్తానని కమిషనర్ హామీ ఇవ్వడం వల్ల కాలనీవాసుల ధర్నాను విరమించారు.
ఇవీ చూడండి:'మహిళల భద్రతకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేంద్రాల భరోసా'