ETV Bharat / state

ఈనెల 21 వరకు ధరణి రిజిస్ట్రేషన్లు నిలిపివేత - తాజా వార్తలు

రాష్ట్రలో ఈనెల 21 వరకు ధరణి రిజిస్ట్రేషన్లు నిలిపేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. లాక్​డౌన్​ పరిస్థితుల వల్ల క్రయవిక్రయాలకు సాధ్యం కాదని అందువల్ల రిజిస్ట్రేషన్లు ఆపేస్తున్నట్లు సీఎస్​ సోమేశ్​కుమార్​ వెల్లడించారు.

land registrations stopped
Dhanani stopped
author img

By

Published : May 12, 2021, 10:05 PM IST

రాష్ట్రంలో లాక్​డౌన్​ అమల్లో ఉన్న రోజుల్లో భూముల క్రయవిక్రయాలు చేయడం సాధ్యం కాదని.. అందువల్ల ఈనెల 21 వరకు ధరణి రిజిస్ట్రేషన్లు నిలిపేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. భూముల రిజిస్ట్రేషన్​ చేయాలంటే కనీసం నలుగురు అవసరం ఉంటుందని... ఆ సమయంలో ఇద్దరు సాక్షులతో రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే పరిస్థితి లేదని సీఎస్​ తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని మండల కార్యాలయాల్లో ధరణి రిజిస్ట్రేషన్లు నిలిపేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. స్లాట్లు బుక్​ చేసుకున్న వారికి ఈ నెల 21 తర్వాత రీషెడ్యూలు చేస్తామని వెల్లడించారు. అప్పటి వరకు మండల రెవెన్యూ అధికారులు, జాయింట్​ సబ్​ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేయొద్దని సీఎస్​ సోమేశ్​ కుమార్​ ఆదేశించారు.

ఇదీ చూడండి: 'అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.