గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పౌరుల ఆస్తుల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వ ఆదేశాలతో దసరా వరకు నమోదు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. న్యాప్ యాప్ ఆధారంగా జీహెచ్ఎంసీ అధికారులు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఇంటి యాజమాని వివరాలతోపాటు కులం, నిర్మాణం, ఆస్తి ఎలా వచ్చింది వంటి 52 రకాల అంశాలను నమోదు చేస్తున్నారు.
హైదరాబాద్ చందానగర్ సర్కిల్ పరిధిలో మున్సిపల్ రెవెన్యూ, అవుట్సోర్సింగ్ సిబ్బందితో పాటు పలు విభాగాలకు చెందిన వారిని నమోదు ప్రక్రియకు వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వం సూచించినట్లు దసరాలోగా ప్రక్రియను పూర్తి చేస్తామని చందానగర్ డిప్యూటీ కమిషనర్ సుదాంశ్ తెలిపారు.
ఇదీ చూడండి: పటిష్ఠ ఏర్పాట్లు: సివిల్ ప్రాథమిక పరీక్ష ప్రారంభం