ETV Bharat / state

రేపట్నుంచి అమల్లోకి ధరణి పోర్టల్​... ప్రారంభించనున్న సీఎం - రేపు మూడుచింతలపల్లి ధరణి పోర్టల్​ను ప్రారంభించనున్న సీఎం

పారదర్శకంగా, సులువుగా ఆన్​లైన్ విధానంలో భూసంబంధిత సేవలు రేపట్నుంచి అందుబాటులోకి రానున్నాయి. కోర్ బ్యాంకింగ్ విధానంలో భూలావాదేవీలు జరిగేలా రూపొందించిన ధరణి పోర్టల్ రేపట్నుంచి ప్రారంభం కానుంది. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలో దత్తత తీసుకున్న మూడుచింతలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్​ను ప్రారంభించనున్నారు. ఇకనుంచి రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు ఏకకాలంలో జరగనున్నాయి.

Dharani portal launch on Thursday
రేపట్నుంచి అమల్లోకి రానున్న ధరణి... ప్రారంభించనున్న సీఎం
author img

By

Published : Oct 28, 2020, 5:21 AM IST

రేపట్నుంచి అమల్లోకి రానున్న ధరణి... ప్రారంభించనున్న సీఎం

భూసంబంధిత లావాదేవీలు పూర్తి పారదర్శకంగా జరిగేలా కొత్త రెవెన్యూ విధానం రేపట్నుంచి అమల్లోకి రానుంది. ధరణి పోర్టల్ ద్వారా ఇకనుంచి భూలావాదేవీలు కోర్ బ్యాంకింగ్ విధానం తరహాలో జరగనున్నాయి. ఇందుకోసం ధరణి పోర్టల్​ను పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులకు పోర్టల్​లో వేర్వేరుగా చోటు కల్పించారు. కొత్త రిజిస్ట్రేషన్లు, వారసత్వ బదిలీలు, తదితర లావాదేవీలన్నీ ఇకనుంచి ధరణి ద్వారానే జరగనున్నాయి. పోర్టల్​లో భూములు, ఆస్తుల సమాచారం, నిషేధిత జాబితాలోని భూములు, ఎన్​ కంబరెన్స్ సహా స్టాంపు డ్యూటీ నిర్ధరణ కోసం భూముల వారీగా మార్కెట్ విలువను పొందుపరిచారు. రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు పోర్టల్ ద్వారానే స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

తహసీల్దార్ల వద్దే..

ఇకనుంచి వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు తహసీల్దార్ల వద్దే జరుగుతాయి. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 570 గ్రామీణ ప్రాంత తహశీల్దార్లు ఇకనుంచి సంయుక్త సబ్​రిజిస్ట్రార్లుగా కూడా వ్యవహరిస్తారు. స్లాట్ బుక్ చేసుకున్న అనంతరం రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ రుసుము ఆన్​లైన్ లేదా చలాన్ ద్వారా చెల్లించి డాక్యుమెంట్​ను సిద్ధం చేసుకోవాలి. నిర్ణీత సమయంలో అమ్మకందారు, కొనుగోలుదారు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ వద్ద ఫొటోలు, సంతకాలు, సాక్షులు సంబంధిత ప్రక్రియ పూర్తి చేసుకున్నాక అన్ని వివరాలను పరిశీలించి తహసీల్దార్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఆ వెంటనే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ స్కానింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేసి డాక్యుమెంట్​ను ఇస్తారు. పాసుపుస్తకాల్లో ఆ వివరాలు నమోదు చేస్తారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైన వెంటనే మ్యుటేషన్ కూడా పూర్తి చేస్తారు.

పారదర్శక సేవలే ధ్యేయం

వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి కూడా సబ్​రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇదే తరహాలో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగుతాయి. ధరణి అమలు కోసం తహసీల్దార్ కార్యాలయాల్లో అవసరమైన ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం... వారికి శిక్షణ కూడా ఇచ్చింది. నమూనా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా పూర్తి అయింది. సులువైన, పారదర్శక సేవలే ధ్యేయంగా ధరణి దేశంలోనే ట్రెండ్ సెట్టర్​గా నిలుస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.

మూడుచింతలపల్లిలో ప్రారంభించనున్న సీఎం

రేపు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ధరణి పోర్టల్ ప్రారంభం కానుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో తాను దత్తత తీసుకున్న మూడుచింతలపల్లిలో పోర్టల్​ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు. సీఎం ప్రారంభించనున్న నేపథ్యంలో సీఎస్ సహా ఉన్నతాధికారులు అక్కడ పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీఎం ప్రారంభించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్లా ధరణి అమల్లోకి వస్తుంది. దీంతో గత 50 రోజులుగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు తిరిగి ప్రారంభమవుతాయి.

ఇవీ చూడండి: సీఎం కేసీఆర్ దత్తత మండలంలో సీఎస్​​ సోమేశ్​ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.