రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేస్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రజలందరూ తమ పనులను ముగించుకుని ఇళ్లకు వెళ్లాలని సూచించారు. తార్నాక చెక్‌పోస్ట్ వద్ద సోమవారం తనిఖీలు చేపట్టారు.
గూడ్స్ వాహనాలకు కేవలం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 11 వరకు మాత్రమే అనుమతి ఉందని స్పష్టం చేశారు. రాష్ట సరిహద్దుల్లో పటిష్ఠ చర్యలు చేపట్టామని వెల్లడించారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించిందని అన్నారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి: ఊబకాయులా? గుండె జబ్బు ముప్పు తగ్గించుకోండి ఇలా!