ETV Bharat / state

'అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తం'

నేడు దేశవ్యాప్త బంద్​ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం డీజీపీ మహేందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీలు, కమిషనర్​లకు సూచించారు.

dgp mahender reddy said bharat bandh Alert to prevent untoward incidents
'అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తం'
author img

By

Published : Dec 8, 2020, 3:29 AM IST

భారత్ బంద్ పిలుపుతో ఎస్పీలు, కమిషనర్​లతో డీజీపీ మహేందర్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతి, భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

రాజకీయ పార్టీలు చేపట్టిన భారత్ బంద్ సందర్భంగా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలోని పోలీస్ కమీషనర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

బంద్ సందర్భంగా సామాన్య ప్రజానీకానికి ఏ విధమైన ఇబ్బందులు, అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా అత్యవసర సేవలకు ఏవిధమైన అంతరాయం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చూడండి : భారత్​బంద్​ దృష్ట్యా వాహనదారులకు సీపీ సజ్జనార్ సూచనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.