ETV Bharat / state

DGP Mahender reddy review : డ్రగ్స్​ నిరోధంపై పోలీస్ ఉన్నతాధికారులతో డీజీపీ సమీక్ష - police meet

DGP Mahender reddy review : మాదకద్రవ్యాల నిరోధంపై పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీ మహేందర్ రెడ్డి సమావేశమయ్యారు. సీఎం సమీక్ష నేపథ్యంలో ఈ సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్​ నిరోధంపై అంతర్గత సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.

DGP Mahender reddy review, police meet
మాదకద్రవ్యాల నిరోధంపై పోలీసుల అంతర్గత సమావేశం
author img

By

Published : Jan 28, 2022, 1:30 PM IST

DGP Mahender reddy review : డ్రగ్స్ నియంత్రణ చర్యలపై సీఎం సమీక్ష నేపథ్యంలో డీజీపీ మహేందర్‌ రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమీక్షలో హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ సీపీలతో పాటు డీజీలు, ఎస్పీలు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మాదకద్రవ్యాల నిరోధంపై అంతర్గత సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ సరఫరా, వినియోగంపై సీఎంకు నివేదిక ఇవ్వనున్న డీజీపీ... పోలీస్ శాఖ తరఫున నివేదిక అందించనున్నారు. సీఎంతో సమీక్షకు 57 మంది పోలీస్ అధికారులు హాజరుకానున్నారు.

కాసేపట్లో సీఎం సమీక్ష

CM KCR Meeting: రాష్ట్రంలో మాదక ద్రవ్యాల పూర్తి నియంత్రణే ధ్యేయంగా మధ్యాహ్నం కీలక సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ ప్రగతిభవన్‌లో రాష్ట్రస్థాయి పోలీసు, ఆబ్కారీ సదస్సు జరగనుంది. హోం, ఆబ్కారీ శాఖల మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, సీఎస్​ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వాడకాన్ని కఠినంగా నియంత్రించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశంలో చర్చించి విధివిధానాలు ఖరారు చేయనున్నారు. పోలీసు, ఎక్సైజ్ శాఖల అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు.

డ్రగ్స్​పై ఉక్కుపాదం

డ్రగ్స్ అనే మాటే రాష్ట్రంలో వినపడకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలని ఇప్పటికే సీఎం అధికారులను ఆదేశించారు. మాదకద్రవ్యాల వినియోగించినట్లు తేలితే ఎంతటివారైనా కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. కఠిన చర్యల అమలు కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించాలని... రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మందితో కూడిన ప్రత్యేక నార్కోటిక్ అండ్ ఆర్గనైజ్‌డ్‌ క్రైమ్ కంట్రోల్ సెల్‌ను ఏర్పాటు చేయాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు. డ్రగ్స్, వ్యవస్థీకృత నేరాలను నియంత్రించేందుకు కఠినచర్యలు తీసుకునేందుకు ఈ విభాగం.... డీజీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక విధులను నిర్వర్తించనుంది. ప్రత్యేక విభాగం ఏర్పాటు, విధివిధానాలు, పనితీరు సహా ఇతర అంశాలపై ఇవాళ్టి సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

ప్రత్యేక నిఘా

సీఎం ఆదేశాలతో గతంలోనే ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు వివిధ ప్రాంతాల్లో క్వింటాళ్ల కొద్దీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణా చేసేవారిపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 246 కేసులు నమోదు చేసి 2వేల కిలోల గంజాయి, 34 గ్రాముల కొకైన్, 41 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. 602మందిని అరెస్టు చేయగా.. వీళ్లలో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న ఇద్దరు నైజీరియన్లతోపాటు తరచూ గంజాయి విక్రయిస్తున్న 62మందిపై కేసు నమోదు చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోనూ 93 కేసులు నమోదు చేసి 175మందిని అరెస్ట్ చేశారు. 5,700కిలోల గంజాయితోపాటు ఇతర మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ గంజాయి, మాదక ద్రవ్యాలు విక్రయించే వాళ్లపై కేసులు నమోదు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: CM KCR: 'రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాటే వినపడకుండా చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.