DGP on Jobs: పోలీసు ఉద్యోగాల కోసం ప్రయత్నించే యువతకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కమిషనరేట్లు, జిల్లాల పరిధిలో ప్రత్యేక శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా యువతకు శిక్షణ ఇచ్చి.. పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే విధంగా వాళ్లను చైతన్యపర్చాలని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.
గత ఏడేళ్లుగా జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలో యువతకు పోలీస్ అధికారులు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. వసతి కూడా కల్పిస్తున్నారు. పేద, మధ్యతరగతికి చెందిన యువతీ యువకులు ఈ శిక్షణా శిబిరాలను ఉపయోగించుకొని పోలీసు ఉద్యోగాలు సాధిస్తున్నారు. హైదరాబాద్ కమిషనర్‌గా ఉన్న సమయంలో మహేందర్ రెడ్డి శిక్షణ శిబిరాలను నిర్వహించారు. డీజీపీ అయిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలోనూ ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనివల్ల పోలీసుల పట్ల యువత సుహృద్భావంతో వ్యవహరిస్తున్నారు.
ఇదీ చదవండి: