ETV Bharat / state

ap dgp: తెదేపా కార్యాలయంపై దాడి.. ఏపీ డీజీపీ ఏమన్నారంటే..?

మంగళగిరిలో తెదేపా కార్యాలయంపై మంగళవారం జరిగిన దాడి ఘటనపై.. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. డ్రగ్స్ అంశంతోపాటు తెదేపా కార్యాలయంపై దాడి అంశాన్ని ప్రస్తావించారు. తెదేపా పార్టీ కార్యాలయం నుంచి దారుణంగా మాట్లాడారని చెప్పారు. పరుష పదజాలం వాడిన తర్వాతే ఆందోళనలు జరిగాయని వివరించారు. రాజకీయ పార్టీలకు బాధ్యత ఉండాలన్నారు. నిన్న ఓ కాల్‌ వచ్చిందని ఎవరు మాట్లాడుతున్నారో స్పష్టత లేదని గౌతమ్‌ సవాంగ్‌ వివరించారు.

DGP on Attacks
DGP on Attacks
author img

By

Published : Oct 20, 2021, 3:52 PM IST

ఏపీలో హెరాయిన్‌ వ్యవహారంపై గతంలోనే స్పష్టం చేశామని ఆ రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. గుజరాత్‌లో పట్టుబడిన డ్రగ్స్‌కు విజయవాడకు సంబంధం లేదని తెలిపారు. అక్కడి నుంచి ఒక్క గ్రాము కూడా ఏపీకి రాలేదని ఇదివరకే మీడియా సమావేశం ద్వారా ప్రజలకు విజయవాడ సీపీ చెప్పారన్నారు. డ్రగ్స్‌తో ఏపీకి ఏ మాత్రం సంబంధం లేదని ఆయన తెలిపారు. ఎన్‌ఐఏ ఏజెన్సీని కూడా సంప్రదించామని తెలిపారు. డీఆర్‌ఐ అధికారులు కూడా పూర్తి సమాచారం ఇచ్చారన్నారు. డ్రగ్స్‌పై ఇన్ని సార్లు స్పష్టంగా చెప్పినా పదే పదే ఆరోపణలు చేయడం మంచిది కాదని హితవు పలికారు.

వారిపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు

రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు. అసభ్య పదజాలం ఎవరికీ మంచిది కాదని డీజీపీ అన్నారు. తెదేపా పార్టీ కార్యాలయం నుంచి దారుణంగా మాట్లాడారని చెప్పారు. పరుష పదజాలం వాడిన తర్వాతే ఆందోళనలు జరిగాయని వివరించారు. రాజకీయ పార్టీలకు బాధ్యత ఉండాలన్నారు. నిన్న ఓ కాల్‌ వచ్చిందని ఎవరు మాట్లాడుతున్నారో స్పష్టత లేదని గౌతమ్‌ సవాంగ్‌ వివరించారు.

ఇదీ చూడండి: చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష.. శనివారం అమిత్‌ షాతో భేటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.